Site icon PRASHNA AYUDHAM

ప్రతి చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలి: ఎమ్మెల్సీ డా.చిన్నమైల్ అంజిరెడ్డి

IMG 20251012 190240

Oplus_131072

సంగారెడ్డి/పటాన్ చెరు, అక్టోబర్ 12 (ప్రశ్న ఆయుధం న్యూస్): పోలియో రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్సీ డా. చిన్న మైల్ అంజిరెడ్డి కోరారు. ఆదివారం రామచంద్రపురంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ మేరకు పలువురు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. 5 ఏండ్ల లోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కల మందు వేయిస్తేనే ఆరోగ్యకర భారత్‌ సాకారం అవుతుందని తెలిపారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని అధికారులు బాధ్యతగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి, వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.

Exit mobile version