గురుకుల పాఠశాలల్లో రాజకీయాలు తగవు
యువజన కాంగ్రెస్ నాయకులు టేకుల శ్రావణ్
హుజరాబాద్ జూలై 29 ప్రశ్న ఆయుధం
నిత్యం పత్రికల్లో ప్రసార మధ్యమాల్లో, సోషల్ మీడియా లో కనిపించడం కోసం తనకు నచ్చినట్లు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నారని యువజన కాంగ్రెస్ నాయకులు టేకుల శ్రావణ్ అన్నారు కాంగ్రెస్ యువ నాయకుడు శ్రవణ్ మాట్లాడుతూ నిత్యం కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడమే టార్గెట్ గా పెట్టుకుని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన నోటికి వచ్చినట్లు అద్దు అదుపు లేకుండా మాట్లాడుతున్నారని తీరు చూస్తుంటే హుజురాబాద్ ప్రజలు తలదించుకునే పరిస్థితి ఏర్పడిందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కౌశిక్ రెడ్డి లాంటి వ్యక్తి విమర్శించడం తగదని కాంగ్రెస్ కు బి ఆర్ ఎస్ కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని పది సంవత్సరాలు అధికారంలో ఉండి చేయలేని పనులను కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలల్లో చేసి చూపించిందని కెసిఆర్ కేటీఆర్ మెప్పుకోసం ఏదో ఒకటి మాట్లాడి నిత్యం వార్తల్లో ఉండాలని కౌశిక్ రెడ్డి పిచ్చిపిచ్చిగా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు ప్రజలను మభ్యపెట్టి బ్లాక్ మెయిల్ చేసి చస్తానని గెలిచిన కౌశిక్ రెడ్డి అవాకులు చేవాకులు పేలితే చూస్తూ ఊరుకోమని తగిన విధంగా బుద్ధి చెబుతామని పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గురుకుల పాఠశాల వసతులలో మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం డైట్ కాస్మోటిక్ చార్జీలు పెంచడమే కాకుండా గత బిఆరెస్ ప్రభుత్వం కంటే అదునాతన సౌకర్యాలు అందిస్తుంటే అది చూసి ఓర్వలేక తప్పుడు ఆరోపణలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుతున్నవని ప్రభుత్వం పట్ల లేని పోనీ నిందలు వేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.