రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆయనను హైదరాబాద్లోని నివాసంలో కలిశారు.
హైదరాబాద్లో కౌన్సిలర్లను సన్మానించిన అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేసినా ప్రజల మద్దతుతో బీఆర్ఎస్ అభ్యర్థులు నిలిచారని తెలిపారు. గెలిచిన, ఓడిన అభ్యర్థుల పోరాట స్ఫూర్తిని ఆయన అభినందించారు.
ప్రజల ఆశీస్సులు, కార్యకర్తల కృషితో బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సంగారెడ్డి, సదాశివపేట కౌన్సిలర్లు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


