*క్రిస్మస్ పర్వదినం రోజున పేదలకు బట్టలు పంపిణీ చేసిన పొనగంటి శ్రీలత- సంపత్*
*జమ్మికుంట డిసెంబర్ 25 ప్రశ్న ఆయుధం:*
జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డ్ లో గల మారుతి నగర్ లో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని జమ్మికుంట పిఎసిఎస్ చైర్మన్ పొనగంటి సంపత్ 8వ వార్డు కౌన్సిలర్ పొనగంటి శ్రీలత 400 మంది పేద ప్రజలకు బట్టలు పంపిణీ చేశారు. రామచందర్ పాస్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు ముఖ్యఅతిథిగా పిఎసిఎస్ చైర్మన్ పొనగంటి సంపత్ కౌన్సిలర్ పొనగంటి శ్రీలత పాల్గొని కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్న ప్రసాద వితరణ చేశారు.