చేప పిల్లల కోసం ఎదురుచూస్తున్న చెరువులు

 

కాంగ్రెస్ ప్రభుత్వం తరుపున చెరువులకు ఉచిత చేప పిల్లల పంపిణీ ఉన్నట్టా? లేనట్టా….? ఉంటె త్వరగ అందించాలి-అశ్వారావుపేట నియోజకవర్గం ఆదివాసీ నాయకులు తంబల్ల.రవి 

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గ ఆదివాసీ నాయుకులు తంబల్ల రవి మాట్లాడుతూ గత ప్రభుత్వం చెరువులకు చేప పిల్లల పంపిణీ చేసింది,మరి కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ఉన్నదా లేదా అని అశ్వారావుపేట నియోజకవర్గ ఆదివాసీ నాయకులు ప్రశ్నించారు.ఉచిత చేప పిల్లలా పంపిణీ ఉన్నాదో,లేధో ఇప్పటికీ తెలవడం లేదని,నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో చెరువులు నిండు కుండలా నిండి ఉన్నవి,చేప పిల్లల కోసం ఎదురుచూస్తున్నవి,ఈ ఏడాది

సగం కాలం అయిపోతుంది,దసరా కూడా వచ్చింది,చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ఉన్నదా…ఉంటే త్వరగా చేప పిల్లలు చెరువులకు అందించాలని ప్రభుత్వాన్ని అశ్వరావుపేట నియోజకవర్గం ఆదివాసీ నాయుకులు తంబల్ల రవి కోరారు.

Join WhatsApp

Join Now