Headlines
-
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు కబడ్డీ పోటీలను విజయవంతంగా నిర్వహించాలని కోరారు
-
కబడ్డీ క్రీడాకారులకు, అభిమానులకు విజ్ఞప్తి
-
ప్రపంచవ్యాప్తంగా పేద వర్గాలకు సేవ చేయాలని ఉద్దేశం
రెవిన్యూ,గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి.శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు సందర్బంగా 28,29,30 తేదీలలో జరుగు కబడ్డీ పోటీలను జయప్రదం చేయండి::భద్రాద్రి కొత్తగూడెం కబడ్డీ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ:- మోదుగు.జోగారావు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఓ సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కబడ్డీ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ మోదుగు.జోగారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ,గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి.శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు సందర్బంగా ప్రకాశియం స్టేడియంలో ఏర్పాటు చేసిన పురుషుల మరియు లేడీస్ కబడ్డీ పోటీలను జయప్రదం చేయాలని కబడ్డీ క్రీడా కారులను,అభిమానులను,శ్రేయోభిలాషులను కోరినారు.ఇలాంటి పుట్టినరోజు రోజులను మరెన్నో జరుపుకొని,పేద వర్గాలకు సేవ చేయాలని మంత్రి పొంగులేటి.శ్రీనివాస్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపినారు