సంగారెడ్డి ప్రతినిధి, మే 17 (ప్రశ్న ఆయుధం న్యూస్): రైతులు నచ్చిన మెచ్చిన చట్టం భూ భారత రెవిన్యూ చట్టం అని, భూ భారతి ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర రెవిన్యూ గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల కేంద్రంలో భూ భారతి పైలెట్ ప్రాజెక్ట్ పై రెవెన్యూ సదస్సులో ముఖ్య అతిథిగా హాజరైన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఎంపీ సురేష్ శెట్కార్, నారాయణ్ ఖెడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ చైర్మెన్ ఎం.ఎ. ఫహీంలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ మినిస్టర్ గా నేను మా స్వార్థం కోసం ఈ చట్టాన్ని చేయలేదు 18 రాష్ట్రాల్లో ఉన్న రెవెన్యూ చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించి, అందులో ఉన్న ముఖ్యమైన అంశాలను తీసుకుని వేలాది మంది అభిప్రాయాలను తీసుకొని మీరు నచ్చిన మెచ్చిన చట్టమే భూభారతి చట్టం అని మంత్రి పేర్కొన్నారు. ఆనాడు ధరణి చట్టాన్ని తీసుకొచ్చారు. కానీ సమస్యలు వస్తే దాన్ని పరిష్కరించే మార్గం చూపు లేదన్నారు దానికి కారణంగా భూములున్న ఆసాములు ఇబ్బంది పడ్డారని తెలిపారు. రైతుల భూ సమస్యలు గుర్తించే ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. మనిషికి ఆధార్ ఎలా ఉంటుందో.. అదే విధంగా భూదాన్ను కూడా ఈ చట్టంలో పెట్టడం జరిగిందన్నారు. ఎక్కువగా భూములకు బౌండరీ లేకపోవడం మ్యాప్ లేకపోవడం వల్ల భూ సమస్యలు తలెత్తాయన్నారు. భూ భారతి చట్టంలో సర్వే చేసి మ్యాపులు ఇచ్చి పాస్ బుక్ లో అప్లోడ్ చేస్తే శాశ్వతంగా భూ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆ సర్వే నంబర్ కి గాని ఆ ఖాతాకి గాని భవిష్యత్తులో ఎప్పుడు ఇబ్బందులు రావనిఈ సందర్భంగా తెలిపారు. రాబోయే రోజుల్లో రిజిస్ట్రేషన్ టైం లోనే భూములకు సర్వే మ్యాప్ రిజిస్ట్రేషన్ తో పాటు మీ పాస్ బుక్ లో కానీ మీ డాక్యుమెంట్ లో కానీ అప్లోడ్ చేసే కార్యక్రమాన్ని ఈ చట్టంలో ప్రవేశపెట్టనున్న అని తెలిపారు. భూ భారతి చట్టంలో రైతులకు డాక్యుమెంట్ సాఫ్ట్ కాపీతో పాటు హార్డ్ కాటు కూడా అందించి జమాబంది కార్యక్రమాన్ని కచ్చితంగా ఏర్పాటు చేస్తామన్నారు. భూ భారతి కోసం నాలుగు పైలెట్ మండలాలను ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ మండలాల్లో వచ్చిన దరఖాస్తుల్లో సాదా బైనామ కాకుండా మిగతా అంశాలన్నిటిని జూన్ రెండు నాడు పరిష్కరించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ ప్రైవేటు ఫారెస్టు రెవెన్యూ దేవాలయాలకు సంబంధించిన కొన్ని భూతాగాదాలున్న మాట వాస్తవమని భూ సమస్యలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ప్రత్యక్షంగా సర్వే చేసి శాశ్వతంగా ఆ భూ సమస్యలకు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కు సూచన చేశారు. ధరణిలో ఏ సమస్య వచ్చినా సివిల్ కోర్టుకు పోవాల్సి వచ్చేదని కానీ భూభారతిలో ఎమ్మార్వో ఆర్డీవో అడిషనల్ కలెక్టర్ సీసీఎల్ ఏ స్థాయిలో తప్పు జరిగితే ఆ స్థాయిలో అప్పిల్ కు వెళ్లే అవకాశం ఈ చట్టంలో వెసులుబాటు కల్పించడం జరిగిందన్నారు. అంతే కాకుండా ప్రత్యేకంగా ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 నాడు ప్రతి రెవెన్యూ గ్రామానికి తహసిల్దార్ స్థాయి అధికారులతో వారి టీం మీ గ్రామానికి వస్తుందని భూ భారతికి చట్టానికి సంబంధించి రెండు రోజుల ముందే మీకు దరఖాస్తు ఫారాలు ఇస్తారని, మీ సమస్యలు ఇచ్చేసి అధికారులకు ఇస్తే మీ సమస్యను మీ గ్రామంలోని పరిష్కరించే విధంగా చూడడం జరుగుతుందన్నారు. రైతులెవరు భూ భారతి చట్టం గురించి అభద్రతకు గురికా వద్దన్నారు. మీరు నచ్చిన మెచ్చిన చట్టమే భూభారతి చట్టం అన్నారు. పేదవాడికి మంచి కలిగించే ఉద్దేశం కొద్దీ ఈ చట్టాన్ని సవరించే అవకాశం కూడా కల్పించడం జరిగింది అన్నారు. భూభారతి చట్టాన్ని అమలు చేసే దాంట్లో అధికారులు నిర్లక్ష్యం వహించిన స్వార్థపూరితమైన ఆలోచనతో ఎవరైనా రైతులను ఇబ్బంది పెట్టినట్లు తెలిస్తే ఈ చట్టంలో ప్రొహిబిషన్ ఏర్పాటు చేశామని అలాంటి అధికారుల మీద కఠిన చర్యలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉంటాయని మంత్రి అధికారులను హెచ్చరించారు. అధికారులు మానవతా దృక్పథంతో ఉండాలని సూచించారు. ఇందులో ఏ రాజకీయ పార్టీ ముఖ్యం కాదు అన్నారు. రాష్ట్రంలో 32 మండలాలు భూభారత్ చట్టం తీసుకొచ్చామని జూన్ 2 నాడు దాని ఫలితాలు ప్రజలకు అందుతాయి అన్నారు. ఆగస్టు 15 నాటికి భూభారతి చట్టం ద్వారా భూ సమస్యలన్నిటినీ పరిష్కరించాలన్నది ఈ చట్టం ముఖ్య ఉద్దేశం అన్నారు. ఈరోజు సాయంత్రం వరకు రాష్ట్రంలో సుమారు 6000 మంది లైసెన్స్ సర్వేయర్లను భూభారతి చట్టం కోసం నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. జూన్ 2 తారీఖు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ట్రైని సర్వేయర్లని నియమిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి మండలం యూనిట్ చేసి సర్వేలను ప్రజలకు అందుబాటులో ఉంచే విధంగా చూస్తామన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం తరఫున 256 మంది సర్వేయర్లు ఉన్నారని, మరో వెయ్యి మంది సర్వేయర్లు ఉండే విధంగా కార్యక్రమం చేపడతామన్నారు. ఆనాటి ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా 10,956 వీఆర్వో వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేశారని గుర్తు చేశారు దాని వలన గ్రామీణ ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో నివసించే భూములు ఉన్న రైతులు రెవెన్యూ అధికారులు ఇబ్బంది గురయ్యారని అన్నారు. ప్రజల కోరిక మేరకు జూన్ రెండో తారీఖున 10,956 రెవెన్యూ అధికారులను నియమించడం జరుగుతుందన్నారు. పేదవాళ్లలో బహు పేదవారికి ఇల్లు నిర్మించాలన్న దృఢ సంకల్పంతో రాష్ట్రంలో మొదటి విడతగా నాలుగున్నర లక్షల ఇండ్లు ఇస్తున్నామని అందులో భాగంగా నియోజకవర్గానికి 3500 చొప్పున ఇల్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం డబల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టి వివిధ స్థాయిలో ఆగిపోయిన వాటిని ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన పేదవారికి ఇందిరమ్మ ఇల్లు వస్తాయని ఆ శాఖ మంత్రిగా చెబుతున్నానని ఆయన స్పష్టం చేశారు. మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ.. తెలంగాణ అంటేనే భూ పోరాటాల చరిత్ర అని,దున్నేవాడిదే భూమి అనే పదాన్ని చాలా సంవత్సరాలుగా వింటూనే ఉన్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా నూతన చట్టాన్ని తీసుకొచ్చి పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసిందన్నారు. గత ప్రభుత్వం ధరణి తీసుకొచ్చి రైతులను గోస పెట్టిందని అన్నారు. చాలా సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలు భూ భారతి చట్టం ద్వారా పరిష్కారం అవుతాయని భావిస్తున్నాన్నారు. ధరణి పోర్టల్ ఉన్న ఇబ్బందులను సరి చేసే విధంగా కొత్త భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో సంభందిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.
రైతులు నచ్చిన మెచ్చిన చట్టం భూ భారతి రెవెన్యూ చట్టం: రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
Oplus_131072