సంగారెడ్డి/పటాన్ చెరు, మార్చి 11 (ప్రశ్న ఆయుధం న్యూస్): గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామంలో డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షకు పొన్నాల శ్రీనివాసరెడ్డి సంఘీభావం తెలిపి 20వేల ఆర్థిక సహాయాన్ని జేఏసీ నాయకులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్యారానగర్‌లో ఏర్పాటు చేయనున్న డంపింగ్ యార్డ్‌ను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామ ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని, వారి హక్కులను పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల అభిప్రాయాలను లెక్కచేయకుండా నిర్ణయాలు తీసుకోవడం తగదని పేర్కొన్నారు. డంపింగ్ యార్డ్ వల్ల కలిగే పరిణామాలను వివరిస్తూ, ఇది గ్రామస్తుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించనుందని అన్నారు. స్థానికుల మద్దతుతో నిరసనలు మరింత ఉధృతం చేస్తామని, సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నల్లవల్లి గ్రామస్తులు, జేఏసీ నాయకులు పొన్నాల శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుమ్మడిదల జేఏసీ నాయకులు అమ్మగారి సదానంద రెడ్డి, బి.రాంరెడ్డి, మహి తదితరులు పాల్గొన్నారు.
నల్లవల్లి జేఏసీ నాయకులకు 20వేలు అందజేసిన పొన్నాల శ్రీనివాసరెడ్డి
Published On: March 11, 2025 3:21 pm
