Site icon PRASHNA AYUDHAM

హిందుత్వం పేరుతో ఎన్నికల కోసం వర్గాల మధ్య కులాల మధ్య మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతుంది. 

ఎన్నికల
Headlines:
  1. “పొన్నం ప్రభాకర్ మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు”
  2. “రాజూర నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రచారం”
  3. “మహారాష్ట్ర ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఆశయాలకు ప్రజాస్వామ్య రక్షణ”
  4. “మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ కూటమి గెలుపు ముఖ్యమైందని పొన్నం ప్రభాకర్”
  5. “భారత్ జూడయాత్ర ద్వారా ప్రజల ఆకాంక్షలు సాధించేందుకు కాంగ్రెస్ కూటమి కృషి”
*మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా బల్లర్షా, చంద్రపూర్ , రజురా నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్*

*రాజూర కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్*

దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ కూటమిని గెలిపించాల్సిన అవసరం ఎంతగానో ఉంది 

ఈ కీలకమైన సందర్భంలో ఒక దిశను చూపే అద్భుతమైన అవకాశం మీకు వచ్చింది. 

ఈ దేశాన్ని రక్షించుకోవడానికి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి రాహుల్ గాంధీకి భారత్ జూడయాత్ర ఆలోచన వచ్చింది 

ప్రజల ఆకాంక్షల మేరకు మేమెంతో మాకు అంత అని రాహుల్ గాంధీ ఆశయాలను నిజం చేసేందుకు నడుం బిగించారు 

చాలా వర్గాలకు సరైన ప్రాతినిధ్యం దక్కడం లేదు అన్న ఆశయాన్ని నిజం చేసేందుకు రాహుల్ గాంధీ నడుం బిగించారు. 

చాలా వర్గాలకు ప్రాతినిధ్యం దక్కడం లేదనే కుల గణన నిర్ణయం తీసుకున్నారు..

దురదృష్టవశాత్తు గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాలేదు అయినా మేము అధైర్యపడము వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అధికారంలోకి వస్తుంది 

దేశవ్యాప్తంగా కులకన చేసి తీరుతాం

పులగాన చేస్తే తన్ని తరమండి అని నితిన్ గట్కరి అహంకారపూరిత మాటలు మాట్లాడుతున్నారు 

భవిష్యత్తులో బిజెపి నేతలకు ప్రజలే బుద్ధి చెబుతారు 

ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నేతలు ఏకమైతే వీళ్లకు పుట్టగతులు ఉండవు 

బిజెపిని ఓడించండి దేశాన్ని రక్షించండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి 

ఇదే ప్రతి ఒక్కరి నినాదం కావాలి 

గత ఎన్నికల్లో 400 సీట్లు గెలిపించాలని బిజెపి నేతలు కోరారు 

400 సీట్లు వీళ్లకు ఎందుకంటే ఒకవేళ 400 సీట్లు గెలిపించి ఉంటే రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చి వేసేవారు 

కనీసం భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా చేసేవారు 

దేశానికి స్వాతంత్రం తెచ్చి పెట్టిన కాంగ్రెస్ బావ ప్రకటన స్వేచ్ఛను గౌరవిస్తుంది 

స్వేచ్ఛ తాను కోరుకునే విధంగా జీవించే హక్కును కాంగ్రెస్ ప్రభుత్వాలు కల్పించాయి 

మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టింది 

హిందుత్వం పేరుతో ఎన్నికల కోసం వర్గాల మధ్య కులాల మధ్య మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతుంది. 

బల్లార్షా చంద్రాపూర్ ప్రాంతాల్లో భారీ పరిశ్రమలు కాంగ్రెస్ చలువే

బల్లార్షా పేపర్ ఫ్యాక్టరీ చంద్రపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మించి జాతికి అంకితం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం 

మేం ప్రజలకు ఉపాధి కోసం నిర్మించి ఇస్తే బిజెపి వాటిని ప్రైవేట్ పరం చేస్తుంది 

దేశాన్ని నిరుద్యోగ పాలు చేస్తుంది 

ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలను చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు అడుగుతే నిస్సిగ్గుగా పక్కోడాలు అమ్ముకోవాలని ఎగతాళి చేస్తున్నారు 

ఈ నియోజకవర్గం నుండి మీ అన్నను గెలిపించండి ఉపాధి అవకాశాలు పెంచుతారు..అనుభవజ్ఞులు ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు పరిశ్రమలు నెలకొల్పుతాడు ఉద్యోగాలు తీసుకొస్తారు..నిరుద్యోగాన్ని రూపుమపుతాడు

ఈ ప్రాంతంలో కనీసం ఎవరో తెలియని వ్యక్తికి బిజెపి కూటమి టికెట్ ఇచ్చింది 

 ఈ ప్రాంత బిడ్డ మీ సొంత బిడ్డ గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఎంతో అభివృద్ధి చేశారు.. గెలిపించండి..

బిజెపి కూటమి అభ్యర్థి విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తున్నారు 

బిజెపి ఇచ్చిన డబ్బులు తీసుకొని కాంగ్రెస్ కూటమి అభ్యర్థికి ఓటు వేయాలి 

మీ ఆశీర్వాదంతో కచ్చితంగా ఎమ్మెల్యే గా గెలుస్తారు

మనమంతా ఒకే ప్రాంత బిడ్డలం రాష్ట్ర పునర్విభజన లో భాగంగా ఈ ప్రాంతం మహారాష్ట్రలో ఉండిపోయింది 

ఇక్కడ తెలుగు మాట్లాడే ప్రజలు చాలామంది ఉన్నారు 

మా చుట్టాలు కూడా ఈ ప్రాంతంలో ఉన్నారు..

మహిళా వికాసం కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించండి 

ఇందిరమ్మ ప్రతి పేదవాడికి నివాస గృహాన్ని కల్పించింది.. ఇల్లు కట్టించింది పరిశ్రమలు నెలకొల్పింది. 

మహరాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజాస్వామ్య హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించండి 

ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుంది 

ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేస్తుంది 

కాంగ్రెస్ మాటంటే మాటే మాట ఇస్తే కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంటుంది ఎన్నిసార్లు రుజువైంది..

Exit mobile version