అనాధ పిల్లల మధ్య మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు

*అనాధ పిల్లల మధ్య మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు*

*యువజన జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పర్లపెల్లి నాగరాజు*

*జమ్మికుంట మే 8 ప్రశ్న ఆయుధం*

IMG 20250508 WA2777

జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పర్లపల్లి నాగరాజు ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణంలోని స్పందన అనాథ శరణలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి పిల్లలకు స్వీట్స్, పండ్లు నోట్ బుక్స్ పంపిణీ చేశారు అనంతరం పర్లపల్లి నాగరాజు మాట్లాడుతూ మాజీ ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర బిసి సంక్షేమ రవాణా శాఖ మంత్రి కరీంనగర్ జిల్లా టైగర్ పొన్నం ప్రభాకర్ 58 వ పుట్టినరోజు వేడుకులను స్పందన అనాధాశ్రమంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు

పొన్నం అన్న పోరాట నేపథ్యం మాలాంటి యువతకి ఎంతో మందికి స్ఫూర్తి దాయకం అని పొన్నం పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులని అందరిని తెలంగాణ ఉద్యమానికి మద్దతు పలికే విధంగా ఏకతాటిపైకి తీసుకొచ్చి సోనియా గాంధీ ని మెప్పిచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రన్ని తీసుకరావడంలో ప్రత్యేక పాత్ర పోషించారన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వంలో మహిళలకి ఉచిత బస్ ప్రయాణం కల్పించారాని ప్రత్యేక చొరవతీసుకొని ఆ యొక్క పథకాన్ని అమలు పరచడం ఎంతో గర్వకారణమని ఎన్నో సంవత్సరాల నుండి ఎదురుచూస్తున్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుకై కేంద్ర ప్రభుత్వంనికి పంపిన ఘనత పొన్నం కే చేదుతుంది అని అదే ఈ విధంగా వారు రానున్న రోజుల్లో ఇంకా మరెన్నో పదవులు అధిరోహించాలని తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి పదంలో నడుపుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు, బలహీనవర్గాల అందరికీ అండగా నిలవాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకరి రమేష్, ఇల్లందకుంట దేవస్థానం మాజీ చైర్మన్ దేశిని కోటి, యూత్ కాంగ్రెస్ మాజీ జిల్లా ఉపాధ్యక్షులు సాయిని రవి, ఐ ఎన్ టి యు సి జిల్లా అధ్యక్షుడు అంబాల శ్రీనివాస్, సేవాదల్ నియోజకవర్గ అధ్యక్షుడు నరెడ్ల వినోద్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు తోట స్వప్న, మాజీ కౌన్సిలర్లు బొంగోని వీరన్న, పిట్టల శ్వేత రమేష్ యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి మహ్మద్ సజ్జు జమ్మికుంట యువజన మండల అధ్యక్షుడు బుడిగే శ్రీకాంత్, హుజురాబాద్ మండల అధ్యక్షుడు పంజాల అరవింద్ గౌడ్, వీణవంక మండల అధ్యక్షుడు శీలం సురేందర్ రెడ్డి యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి పంజాల అజయ్, చెన్నావేనా రమేష్ కార్యదర్శులు ఉమ్మడి సందీప్, రోమాల రాజ్ కుమార్, పాతకాల రమేష్, మండల కమిటీ ఉపాధ్యక్షులు వినయ్, శ్యామ్, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, మహేష్, కార్యదర్శులు రవి, అజయ్, SC సెల్ మండల అధ్యక్షులు రాచపల్లి రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు దొడ్డే నవీన్, మొలుగూరి రమేష్, యువజన నాయకులు ప్రవీణ్, రాజు, జావీద్, శివ, శ్రీకాంత్, భాను, పవన్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment