మెదక్/నర్సాపూర్, మే 7 (ప్రశ్న ఆయుధం న్యూస్): శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి సజీవ సమాధి దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నచింతకుంట సమీపంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో పూజలు చేశారు. స్వామి ఆశీస్సులతో సమాజ అభివృద్ధి, శాంతి, సౌభాగ్యం చేకూరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ సంఘం నాయకులు కృపాచారి, నరేందర్ చారి, సదానందంచారి, ప్రవీణ్ చారి, నరేందర్ చారి, శ్రీనివాస్ చారి తదితరులు పాల్గొన్నారు.