ఎంజేపీ మియాపూర్ గురుకులంలో గణనాథుడికి పూజలు
ప్రశ్న ఆయుధం,చేవెళ్ల, మొయినాబాద్, ఆగస్టు 29
మోహినాబాద్ బీసీ గురుకులం మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ జంగం నరేష్, బిఏ అమినేషన్, విద్యార్థులు,మట్టి తో తయారుచేసిన గణనాథుడికి ఉపాధ్యాయ బృందం, మరియు విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు ప్రిన్సిపాల్ జంగం నరేష్ నిర్వహించారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వరుని ఆశీస్సులు విద్యార్థుల పైన ఎల్లప్పుడూ ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో విద్యార్థులు పరీక్ష లో మంచి ఫలితాలు తీసుకురావాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.