Site icon PRASHNA AYUDHAM

ఆర్బిఐ (RBI) డిప్యూటీ గవర్నర్ గా పూనమ్ గుప్తా నియామకం

IMG 20250402 WA2903

ఆర్బిఐ (RBI) డిప్యూటీ గవర్నర్ గా పూనమ్ గుప్తా నియామకం* 

ప్రపంచ బ్యాంకు మాజీ ఆర్థికవేత్త పూనమ్ గుప్తాను డిప్యూటీ గవర్నర్‌గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం నియమించింది. గుప్తా ఈ పదవిలో మూడేళ్ల పాటు ఉంటారు. గుప్తా ప్రస్తుతం NCAER (నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్) డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు. గుప్తా ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలిలో సభ్యురాలు. దీంతోపాటు 16వ ఆర్థిక సంఘం సలహా మండలి కన్వీనర్‌గా పనిచేస్తున్నారు. పూనమ్ అమెరికాలోని మేరీల్యాండ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో PhD, మాస్టర్స్ డిగ్రీలను పొందారు. అంతే కాకుండా ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ సంపాదించారు. 1998లో అంతర్జాతీయ ఆర్థిక శాస్త్రంలో ఆమె డాక్టరేట్ పరిశోధనకు EXIM బ్యాంక్ అవార్డును కూడా అందుకున్నారు.

ప్రస్తుతం, నలుగురు RBI డిప్యూటీ గవర్నర్‌లు ఉండగా, వారిలో పూనమ్ గుప్తా, స్వామినాథన్ J, T రబీ శంకర్, M రాజేశ్వర్ రావు కలరు.

Exit mobile version