అక్రమ గ్రావెల్ తవ్వకాలు అడ్డుకోండి.

గ్రావెల్
Headlines
  1. “అక్రమ గ్రావెల్ తవ్వకాలు: పూనెం ప్రతాప్ చర్యలు తీసుకోవాలని కోరారు”
  2. “అక్రమ గ్రావెల్ తవ్వకాలపై ములుగు జిల్లా ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ పోరాటం”
  3. “వెంకటాపురం మండలంలో అక్రమ గ్రావెల్ తవ్వకాలు: అధికారులు నిర్లక్ష్యం”
  4. “పూనెం ప్రతాప్: అక్రమ గ్రావెల్ తవ్వకాలపై నిబంధనలు పాటించాలి”
  5. “వెంకటాపురం మండల తాసిల్దార్ లక్ష్మీ రాజయ్యకు పూనెం ప్రతాప్ విజ్ఞప్తి

అక్రమ గ్రావెల్ తవ్వకాలు అడ్డుకోండి…ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు పూనెం ప్రతాప్

అక్రమార్కులపై చర్యలు శూన్యం…

మౌనం పాటిస్తున్న మండల తాసిల్దార్…

వెంకటాపురం

ఏజెన్సీ ప్రాంత చట్టాలకు విరుద్ధంగా అక్రమ గ్రావెల్‌ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నా,పట్టించుకునే నాథుడు కరువయ్యారని ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ములుగు జిల్లా ఉపాధ్యక్షులు పూనెం ప్రతాప్ అన్నారు. సోమవారం నాడు వెంకటాపురం మండల తాసిల్దార్ లక్ష్మీ రాజయ్యకు ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అక్రమ గ్రావిల్ తవ్వకాలు నిలిపివేయాలని మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా టి,డబ్ల్యూ,జె,ఏ ములుగు జిల్లా ఉపాధ్యక్షులు పూనెం ప్రతాప్ మాట్లాడుతూ.వెంకటాపురం మండలం వీర భద్రవరం గ్రామ రెవెన్యూ పరిధిలో అక్రమ గ్రావెల్ తవ్వకాలు జరుపుతున్నారని ఇవి కేవలం ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా జరుగుతున్నాయని ఆరోపించారు.గనులు మరియు ఖనిజ అభివృద్ధి మరియు నియంత్రణ చట్టం, 1957 (ఎంఎండిఆర్ చట్టం) సెక్షన్ 3(ఇ) ప్రకారంగా గ్రావెల్ తవ్వకాలు జరపాలంటే సంబంధిత శాఖ నుండి అనుమతులు తీసుకున్న తర్వాతే తవ్వకాలు జరపాలని వివరించారు.కానీ వెంకటాపురం మండల వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఇసుక క్వారీలకు అక్రమ గ్రావెల్ తరలిస్తూ ఎలాంటి నిబంధనలు పాటించకుండా చేస్తున్నారని మండిపడ్డారు.

స్థానికులు ఫిర్యాదులు చేస్తున్నా రెవెన్యూ, గనుల శాఖ అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందని ఆయన వ్యక్త పరిచారు.రాజకీయం,అధికారుల అండదండలతో అక్రమార్కులు తవ్వకాలు జరుపుతున్నారని ఆరోపించారు.అక్రమ గ్రావెల్ పైఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి గ్రావెల్ అక్రమ తవ్వకాలను నిలిపి వేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కూచింటి చిరంజీవి, తుర్స చంటి,వాసం నారాయణ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now