ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య
ప్రశ్న ఆయుధం న్యూస్ నవంబర్ 28 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
సిపిఐ( ఎంఎల్) న్యూడెమోక్రసీ ఇల్లందు మండల దళ కమాండర్ పూనెం రమేష్ బాబు యలియస్ రమేష్ ఎల్లాపురం గ్రామం లో ఆరోగ్యం బాగాలేక విశ్రాంతి తీసుకుంటున్న రమేష్ ను ఇల్లందు పోలీసులు అరెస్ట్ చేశారు. తనకు ఎలాంటి ప్రాణహాని తలపెట్టకుండా కోర్టులో హాజరు పరచాలని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య. ఇల్లందు మాజీ జెడ్పిటిసి చండ్ర అరుణ సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపందా) రాష్ట్ర నాయకులు నాయిని రాజు లు డిమాండ్ చేశారు. ఇల్లందు పోలీసులు అరెస్టు చేసిన పూనెం రమేష్ అరెస్టును బహిర్గత పరచాలని వారు డిమాండ్ చేశారు. ఈ అరెస్టును సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్( ప్రజా పందా) జిల్లా నాయకులు ఈ సం శంకర్, మాచర్ల సత్యం, ఆర్ఎస్సి బోస్, బుర్ర వెంకన్న, వై సావిత్రి , పూనెం కుమార్, పి డి ఎస్ యు నాయకులు కాంపాటి పృద్వి, పి వై ఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాంకుడోత్ అజయ్ తదితరులు ఖండించారు. అరెస్టు చేసిన పూనెం రమేష్ ను కోర్ట్ లో హాజరు పరచాలని డిమాండ్ చేశారు.