భానాస జాతీయ అధ్యక్షులు జీడి సారయ్య
సిద్దిపేట సెప్టెంబర్ 8 ప్రశ్న ఆయుధం :
చేతబడి బాణమతి తదితర మూఢనమ్మకాల పేరుతో విలువైన ప్రాణాలను బలి చేయొద్దని భారత నాస్తిక సమాజం జాతీయ అధ్యక్షులు జీడి సారయ్య పిలుపునిచ్చారు. ఆదివారం నాడు మానవ హక్కుల వేదిక, సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ,దళిత బహుజన ఫ్రంట్, భారత నాస్తిక సమాజం ఆధ్వర్యంలో గొల్లగూడెం లో మూఢనమ్మకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జీడి సారయ్య మాట్లాడుతూ ఇటీవల మెదక్ పట్టణానికి చెందిన రాములును మూఢనమ్మకాలు భానుమతి చేతబడి అనుమానంతో మరణించిన సంఘటనపై ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వివరాలను తెలుసుకోవడానికి వచ్చామన్నారు . మృతుడి బంధువు గంగమ్మ,గ్రామస్తులను,పొ లీసులను కలిసి సంఘటన వివరాలను తెలుసుకున్నామని తెలిపారు.ఆధునిక కాలంలో శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత తరణంలో చేతబడి తదితర నమ్మకాలను నమ్మవద్దని ప్రజలకు వివరించారు దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి శంకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మూఢ నమ్మకాల నిర్మూలన చట్టం తీసుకురావాలని కోరారు. మూఢ నమ్మకాలకు బలవుతున్న బాధిత కుటుంబాలకు నష్టపరిహారము అందించాలని కోరారు. మూఢనమ్మకాలను నిర్మూలించాల్సిన పాలకు బాధ్యత రహిత వల్ల నే ప్రజలలో మూఢ నమ్మకాలు పెరిగిపొతున్నాయన్నారు.ఇటువంటి సంఘటనలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. మూఢనమ్మకాల పై ప్రజలలో అవగహన కల్పించెందుకు సాంస్కతిక సారధి కళకారుల ద్వారా కళజాతాలు నిర్వహించాలన్నారు.మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి హైమద్ ,రాష్ట్ర నాయకులు రోహిత్,సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ స్పార్టకస్ మెదక్ జిల్లా కార్యదర్శి దయాసాగర్ పాల్గొన్నారు.