” పేద ప్రజలందరూ ఉచిత వైద్య శిబిరాల సేవలు సద్వినియోగం చేసుకోవాలి – సత్యం శ్రీరంగం. “

” పేద ప్రజలందరూ ఉచిత వైద్య శిబిరాల సేవలు సద్వినియోగం చేసుకోవాలి – సత్యం శ్రీరంగం. ”

ప్రశ్న ఆయుధం జూన్ 29: కూకట్‌పల్లి ప్రతినిధి

” ప్రతి ఒక్కరు రక్తదానం చేసి ఇంకొక్కరి జీవితంలో వెలుగులు నింపాలి – టీపీసీసీ అధికార ప్రతినిధి, ఎస్ఈఎ జాతీయ అధ్యక్షులు సత్యం శ్రీరంగం.

బాలాజీనగర్ డివిజన్ వివేక్ నగర్ లోని శ్రీ చైతన్య స్కూల్ లో సనాతన ఎంటర్‌ప్రెన్యూర్స్ అసోసియేషన్ ఎస్ఈఎ యూత్ వింగ్ యువ ధ్వని, శ్రీరంగం ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్, లయన్స్ క్లబ్ హైదరాబాద్ బుధపూర్ణిమ (జిల్లా 320D), క్లోవ్ డెంటల్ హాస్పిటల్, యువాన్ హెల్త్ లాబ్స్ సంయుక్త సహకారంతో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరాన్ని ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రారంభించిన టీపీసీసీ అధికార ప్రతినిధి, శ్రీరంగం ఫౌండేషన్ చైర్మన్, సీ జాతీయ అధ్యక్షులు సత్యం శ్రీరంగం. ఈ సందర్బంగా సత్యం శ్రీరంగం మాట్లాడుతూ ఉచితంగా వైద్య సేవలు అందించడం చాలా గొప్ప పరిణామం అని అన్నారు.. ఎంతో మంది వ్యాధిని గుర్తించలేక వైద్యానికి దూరమవుతూ అనేక రోగాల బారిన పడుతున్నారని,రోగికి వచ్చిన వ్యాధిని గుర్తించలేక హాస్పిటల్‌కి వెళ్లే స్థోమత లేక దుర్భరమైన జీవితం గడుపుతూ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారని విచారం వ్యక్తం చేశారు. ప్రతిఒక్కరు తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి ప్రమాదాలు సంభవించినప్పుడు, ఆపద సమయంలో రక్తం ఎంతో అవసరం అవుతుందని అన్నారు. అందుకు ప్రతిఒక్కరు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ శిబిరానికి విస్తృత స్పందన లభించిందని, యువతీ యువకులు స్వచ్చందంగా రక్తదానం చేసారని అన్నారు. అనంతరం వైద్య శిబిరంలో పాల్గొన్న వైద్య బృందానికి, రక్తదాతలకు సత్కరించి వారికీ ధ్రువ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈఎ వ్యవస్థాపకులు ముళ్లపూడి అమ్రిత్, మహిళా విభాగం కార్యదర్శి శిరీష పుల్లే, ఏపీ ప్రసన్న, యువజన విభాగంప్రధాన కార్యదర్శి గౌతమ్ వలివేటి, బాలాజీ నగర్ డివిజన్ అధ్యక్షులు కృష్ణ రాజ్ పుత్, యువ ధ్వని కన్వీనర్ పవన్ తివారి, కో కన్వీనర్ యామిని కాళీమాత, సమన్వయకర్త శ్రవణ్ కశ్యప్ శ్రీవాస్తవ, ఎం ఎస్ ఎన్ మూర్తి, లక్ష్మి మోహన్, రాఘవ, శ్రీధర్ వట్టికోట, శశి పీసపాటి, పవన్, ఫణికుమార్, చందు కాళీమాత, శశి హరి, పవన్, జేస్వంత్, వరుణ్, బాలసుబ్రమణ్యం,యూత్ వింగ్, సీ సభ్యులు, తదితలులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment