కొత్తపల్లిలో పడకేసిన పారిశుధ్యం..
కోటపల్లి మండలం రాజారం గ్రామపంచాయతీ కొత్తపల్లి గ్రామంలో మురికి కాలువలో నెలల తరబడి చెత్తాచెదారం పేరుకుపోయింది. పూడికతీత తీయకపోవడంతో దుర్వాసనతో దోమలు వృద్ధి చెంది విష జ్వరాల బారిన పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించాలని కోరుతున్నారు.