Site icon PRASHNA AYUDHAM

పీహెచ్డీ పట్టా పొందిన ఇరువురిని సన్మానించిన (పోప) పద్మశాలి అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్

IMG 20250824 WA0058

పీహెచ్డీ పట్టా పొందిన ఇరువురిని సన్మానించిన (పోప) పద్మశాలి అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్

జమ్మికుంట ఆగస్టు 24 ప్రశ్న ఆయుధం

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో పీహెచ్డీ పట్టా పొందిన ఇద్దరినీ జమ్మికుంట ఇల్లందకుంట ( POPA ) పద్మశాలి అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ సంఘ బాధ్యులు ఘనంగా సన్మానించారు

జమ్మికుంట లోని ప్రముఖ వైద్యులు డాక్టర్ జగదీశ్వర్ కూతురు డాక్టర్ శిల్ప చిటికెన పీహెచ్డీ మెడిసిన్ ఫిజియాలజీ లో “స్టడీ ఆఫ్ రిలేషన్ షిప్ బిట్వీన్ థైరాయిడ్ హార్మోన్స్ అండ్ గ్లూకోస్ హోమియోస్టాసిస్ అమాంగ్ పోస్ట్ మేనోపాసెల్ డయాబెటిక్ ఉమెన్” అనే విషయంపై పీహెచ్డీ ని BLEDE యూనివర్సిటీ విజయపూర్ కర్ణాటక స్టేట్ నుండి పట్టా పొందారు ప్రస్తుతము డాక్టర్ శిల్పా చిటికెన ప్రభుత్వ మెడికల్ కాలేజ్ జగిత్యాల యందు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్నారు

డాక్టర్ సంయుక్త పెంట భర్త చిటికెన శ్రీధర్ బిజిగిరి షరీఫ్, పీహెచ్డీ ని ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో రెన్యువబుల్ ఎనర్జీ సోర్సెస్ యందు (పిహెచ్డి) పట్టా జేఎన్టీయూ యూనివర్సిటీ, హైదరాబాద్ నుండి అందుకున్నారు ప్రస్తుతం డాక్టర్ సంయుక్త పెంట కేజీ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో అసోసియేట్ ప్రొఫెసర్ గా హైదరాబాదులో పనిచేయుచున్నారు డాక్టర్ శిల్ప చిటికెన డాక్టర్ సంయుక్త పెంట లను జమ్మికుంట పట్టణంలో జమ్మికుంట పద్మశాలి అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారుఈ కార్యక్రమంలో జమ్మికుంట పట్టణ పోపా అధ్యక్షుడు బండి ప్రభాకర్, ఇల్లందకుంట పోప అధ్యక్షుడు చిటికెన వేణు, శ్రీరాంపూర్ మండల విద్యాధికారి ఎస్ మహేష్, లక్ష్మీకాంతం, మేఘ రవీందర్, బైరి ప్రకాష్ , శిల్ప భాస్కర్, సాదుల మనోహర్, డాక్టర్ జగదీశ్వర్, చిటికెన ప్రభాకర్, చిటికెన మురళి కృష్ణ, చిటికెన శ్రీధర్ లు తదితరులు పాల్గొన్నారు

Exit mobile version