*సివిల్ హాస్పిటల్ సెంటర్ జమ్మికుంటను పర్యవేక్షించిన పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ టీం*
*జమ్మికుంట ఫిబ్రవరి 4 ప్రశ్న ఆయుధం*
మంగళవారం రోజున సివిల్ హాస్పిటల్ సెంటర్ జమ్మికుంట జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని సివిల్ హాస్పిటల్ సెంటర్ ను గౌట్ ఆఫ్ ఇండియా నుండి వచ్చిన పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ టీం వారు సందర్శించారు పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ (పి ఆర్ సి) టీం సభ్యులు సివిల్ హాస్పిటల్స్ సెంటర్ లోని ప్రజలకు అందుతున్న వైద్య సేవలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రిలో ప్రజలకు అందుతున్న సేవలను గర్భిణీ స్త్రీలను బాలింతలను వారికి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు ఆపరేషన్ థియేటర్ లేబర్ రూమ్ వార్డులను తనిఖీ చేశారు ప్రజలకు తప్పనిసరిగా మెరుగైన వైద్య సేవలను అందించాలని బిపి డయాబెటిక్ క్యాన్సర్ రోగులకు తప్పనిసరిగా క్రమం తప్పకుండా వైద్య సేవలు అందించాలని ఆదేశించారు వైద్య సిబ్బంది తప్పనిసరిగా ప్రజలకు అందుబాటులో ఉండాలని వారికి వైద్య సేవలు అందించాలని ఆదేశించారు ఆస్పత్రి రికార్డులను పరిశీలించి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ సి టీం సభ్యులు డాక్టర్ వి శరవణ కుమార్, డాక్టర్ రాజ్ కుమార్, కరీంనగర్ డిపిఓ ఎన్ హెచ్ ఎన్ టి స్వామి, డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ చందు, హాస్పిటల్ సూపరిండెంట్ పారుపెల్లి శ్రీకాంత్ రెడ్డి, డిస్ట్రిక్ట్ హెల్త్ ఎడ్యుకేటర్ పంజాల ప్రతాప్ గౌడ్ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.