కుండపోత వర్షాలు.. అప్రమత్తమైన ప్రభుత్వం
Aug 18, 2025,
ఆంధ్రప్రదేశ్ : రాష్ట్రంలో కుండపోత వర్షాలు కారణంగా ప్రభుత్వం అప్రమత్తమైంది. వరదల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలను చేపడుతోంది. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆయా శాఖల అధికారులకు హోంమంత్రి అనిత ఆదేశాలు జారీ చేశారు. నష్ట నివారణ చర్యలను ఆమె పర్యవేక్షిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని స్కూళ్లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.