*గర్భిణీ స్త్రీలు బాలింతలు పోషకాహారం తీసుకోవాలి*
*ఎంపీడీవో పుల్లయ్య డాక్టర్ తులసీదాస్*
*అంగన్వాడి ఆధ్వర్యంలో పోషన్ మహోత్సవం*
*జమ్మికుంట ఇల్లంతకుంట ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 27*
పోషన్ మహోత్సవ కార్యక్రమాన్ని ఇల్లందకుంట మండలంలోని మల్యాల గ్రామంలో అంగన్వాడి సెంటర్లలో ఐసిడిఎస్ సూపర్వైజర్ జ్యోతి నిర్వహించారు దీనికి హాజరైన ఎంపీడీవో పుల్లయ్య మండల వైద్యాధికారి తులసీదాస్ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు బాలింతలు సమతుల్య పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలని బాలికలకు రక్తహీనత ఏర్పడుతుందని దాని నివారణకు పౌష్టికమైన ఆహారం తీసుకోవాలని గ్రామాలలో తిరిగే ఏఎన్ఎంలు ఆశ వర్కర్లు సూచించే సూచనలు పాటిస్తూ ప్రతి శుక్రవారం నిర్వహించే సభకు గర్భిణీలు బాలింతలు హాజరుకావాలని ప్రభుత్వం నిర్వహించే ప్రతి కార్యక్రమం అవగాహన అవుతుందని అన్నారు అనంతరం గర్భిణీలకు శ్రీమంతమును పిల్లలకు అక్షరాభ్యాసం నిర్వహించారు ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ అంగన్వాడి టీచర్లు ఇల్లందకుంట మల్యాల పంచాయతీ కార్యదర్శులు ఆశా వర్కర్లు గర్భిణీ స్త్రీలు బాలింతలు తదితరులు పాల్గొన్నారు