Site icon PRASHNA AYUDHAM

కొద్దిసేపట్లో కొత్త టీచర్లకు పోస్టింగు లు

*కొద్దిసేపట్లో కొత్త టీచర్లకు పోస్టింగులు* 

 

హైదరాబాద్:అక్టోబర్ 15

 

తెలంగాణలో డీఎస్సీ 2024 ద్వారా ఉపాధ్యాయ నియామక పత్రాలను అందుకున్న 10,006 మంది కొత్త ఉపాధ్యాయులకు మంగళవారం పాఠశాల విద్యాశాఖ అధికారులు పోస్టింగులు ఇవ్వనున్నారు. 

 

వాస్తవానికి నేటి ఉదయం కౌన్సిలింగ్ ప్రారంభించవల సి, ఉండగా సాకేతిక కారణాలతో వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది, కాగా సాకేతిక సమస్య పరిష్కారం కావడంతో…

 

డీఎస్సీ 2024 ద్వారా ఎంపికైన కొత్త ఉపాధ్యా యులకు నేడు పాఠశాల విద్యాశాఖ అధికారులు ఈరోజు పోస్టింగులు ఇవ్వనున్నారు. కొత్త టీచర్లు ఆయా డీఈఓలు సూచిం చిన కార్యాలయాల్లో జరిగే కౌన్సెలింగ్స్ కు హాజరు కావాల్సిఉంటుంది. 

 

ఎక్కువగా కలెక్టరేట్లలోనే కౌన్సెలింగ్ ప్రక్రియ ఉండనుంది. ఎస్జీటీకి ఒక హాల్, స్కూల్ అసిస్టెంట్, ఇతర పోస్టులకు కలిపి మరో హాల్ ఏర్పాటు చేసి..అందులో మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్స్ కేటాయిస్తారు. వారు తమకు కేటాయిం చిన పాఠశాలల్లో ఈనెల 16వ తేదీన చేరాల్సి ఉంటుంది. 

 

వారు చేరిన స్థానంలో 3 నెలల క్రితం బదిలీ అయిన రిలీవ్ కాని వారు ఉన్నట్ల యితే వారు గత జులైలో కేటాయించిన పాఠశాలలకు వెళ్తారు. అలాంటి వారు సుమారు 7వేల మంది ఉన్నారు. పోస్టింగ్స్ కేటాయింపు మంగళవారం దాదాపుగా పూర్తవుతుం దని..ఏవైనా మిగిలినట్ల యితే వాటిని బుధవారం పూర్తి చేస్తామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.

Exit mobile version