*పశువుల వార అంగడి తై- బజార్ ఫీజుల వసూలు కోసం బహిరంగ వేలం పాట వాయిదా!*
*
జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో జరిగే పశువుల వారసంత తై బజార్ ఫీజుల వసూలు చేసుకొనుటకు బహిరంగ వేలం మంగళవారం ఏర్పాటు చేయగా బహిరంగ వేలం పాటకు 9 మంది మాత్రమే హాజరు కాగా సరి అయిన కోరం హాజరు కాకపోవడంతో తిరిగి ఈనెల 27 గురువారం రోజున మధ్యాహ్నం 3 గంటలకు వేలంపాట నిర్వహించబడును మున్సిపల్ కమిషనర్ ఎండి ఆయాజ్ ఒక ప్రకటనలో తెలిపారు వేలంపాటలో పాల్గొని ఆసక్తిగల వారు కమిషనర్ పురపాలక సంఘం జమ్మికుంట పేరున ఏదైనా జాతీయ బ్యాంకులో రూ.20,0000 డిపాజిట్ డిడిని తీసి 26 బుధవారం సాయంత్రం నాలుగు గంటల లోపు మున్సిపల్ కార్యాలయంలోని పౌర సేవా కేంద్రంలో సమర్పించాలని అదేవిధంగా 20 లక్షల సాల్వెన్సీ సర్టిఫికెట్ నో- డ్యూ సర్టిఫికెట్లు డిడి తో పాటు జతపరచాలని మున్సిపల్ కమిషనర్ ఎండి ఆయాజ్ తెలిపారు
అలాగే జమ్మికుంట మండలంలోని శంబునిపల్లి గ్రామంలో మంగళవారం నిర్వహించిన అంగడి వేలం పాట వాయిదా పడినట్లు గ్రామపంచాయతీ కార్యదర్శి ఇంగే కిషన్ తెలిపారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దారించిన ధర రాకపోవడంతో ఈ నెల 28న 11.30కు మళ్ళీ వేలం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వేలంలో కొత్తగా పాల్గొనదలిచిన వారు ఈ నెల 27న సాయంత్రం 4 గంటల వరకు రూ. 20 వేల డీడీ ‘పంచాయతీ కార్యదర్శి, శంబునిపల్లి’ పేరున తీసి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సమర్పించాలని అయన సూచించారు.