పోతారం గ్రామ ఎంఆర్పీఎస్ నూతన కమిటీ ఎన్నిక

*పోతారం గ్రామ ఎంఆర్పీఎస్ నూతన కమిటీ ఎన్నిక*

మండలంలోని పోతారం గ్రామంలో ఎంఆర్పీఎస్ బెజ్జంకి మండల ఇంచార్జి చింతకింది పర్శరాములు ఆధ్వర్యంలో, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, మండల, జిల్లా నూతన కమిటీల ఏర్పాటులో భాగంగా మంగళవారం పోతారం గ్రామ కమిటీ నియామకం చేసినట్లు తెలిపారు. అధ్యక్షులుగా తోళ్ల మహేష్, ఉపాధ్యక్షులు గా జేరిపోతుల తిరుపతి, శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి గా జేరిపోతుల మల్లేశం, సహాయకార్యదర్శి గా లింగాల శ్రీకాంత్, ప్రచార కార్యదర్శి గా జేరిపోతుల మహేందర్, కార్యదర్శి గా బోయిని నరేష్, శేఖర్, సంయుక్త కార్యదర్శి గా లింగాల శ్రీనివాస్, గౌరవ సలహాదారులు గా లింగాల లక్ష్మణ్, తిరుపతి, కార్యవర్గ సభ్యులుగా బోయిని సురేష్, చంద్రశేఖర్, రాజయ్య, గణేష్, తోళ్ల శ్రీకాంత్, బోనగిరి లింగయ్య ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు తాడిచెట్టు భూమయ్య, వడ్లూరి పర్శరాములు, మాంకాల రాజు, లింగాల చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment