*విద్యుత్ ప్రమాదాలపై పొలం బాటలో విద్యుత్ అధికారులు రైతులకు అవగాహన*
*ఇల్లందకుంట మార్చి 12 ప్రశ్న ఆయుధం*
బుధవారం రోజున కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని శ్రీరాములపల్లి గ్రామంలో విద్యుత్ అధికారులు పొలం బాట కార్యక్రమం నిర్వహించి రైతులకు విద్యుత్ ప్రమాదాలపై అవగాహన కల్పించారు రైతులు వారి పోలం దగ్గర జరుగు విద్యుత్ ప్రమాదాల గురించి సరి అయిన పద్ధతిలో వివరించి వాటి నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలను కూలంకుషంగా వివరించారు ఎలక్ట్రిసిటీ ఏఈ సుష్మ రైతులతో మాట్లాడుతూ మోటార్ల వద్ద కెపాసిటీలను ఉపయోగించడం వలన కలిగే ప్రయోజనాలను వివరించి ప్రతి రైతు తమ విద్యుత్ మోటార్ల వద్ద కెపాసిటర్లను బిగించుకొని విద్యుత్ సంస్థ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు రైతులు తమ విద్యుత్ మోటార్ల వద్ద ఆటోమేటిక్ స్టార్టర్ ఉపయోగించడం వలన మోటార్లు కాలిపోయే ప్రమాదం ఉందని తెలిపారు దాని వలన విద్యుత్ వృధా అవుతుందని నీటి వృధా ఎక్కువ అవుతుందని అవసరం ఉన్న మేర ఉపయోగించుకోవాలని రైతులకు వివరించారు విద్యుత్ కి సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్న సిబ్బంది కి తెలియజేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఇల్లందకుంట ఎలక్ట్రిసిటీ ఏఈ సుష్మ, రైతులు లక్ష్మణ్ వీరన్న రామారావు జయ కుమార్ రమేష్ తిరుపతి రవి మురళి సదయ్య కృష్ణ సబ్ ఇంజనీర్ దీపక్, సీనియర్ లైన్స్పెక్టర్ రాములు లైన్స్ ఇన్స్పెక్టర్ రాజయ్య, లైన్మెన్లు మోతే శ్రీనివాస్ రాజు దిలీప్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు