వార్తకు స్పందించిన విద్యుత్ అధికారులు
ప్రశ్న ఆయుధం మార్చి 12 కామారెడ్డి దోమకొండ
దోమకొండ మండలంలో విద్యుత్ తీగలపై చెట్ల కొమ్మలతో ప్రమాదకరంగా ఉన్నాయని ప్రశ్నా ఆయుధం లో పలుసార్లు ప్రచురించిన కథనానికి విద్యుత్ అధికారులు స్పందించి బుధవారం దోమకొండ మండలంలోని బస్టాండు నుండి శివరాం మందిర్ గుడి వరకు కరెంటు తీగల మీద చెట్ల కొమ్మలను తొలగించారు. ఈ రోడ్డులో కోపరేటివ్ బ్యాంకు, గవర్నమెంట్ హాస్పిటల్, రిజిస్టర్ రిజిస్టర్ ఆఫీస్, బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ తదితర కార్యాలయాలు ఉన్నాయి. ఇప్పటికే అనేకమార్లు విద్యుత్కు అంతరాయం ఏర్పడిందన్నారు. అధికారులు చెట్ల కొమ్మలను తొలగించడంతో స్థానికులు అభినందనలు తెలిపారు.