ప్రభుత్వ విధానాలతో నష్టాల్లోకి విద్యుత్ సంస్థలు
ఈ ఈ ఐ ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి సుదీప్ దత్
విద్యుత్ రంగాన్ని ప్రైవేటుపరం చేస్తే మెరుపు సమ్మె తప్పదు
టీజీ యు ఈ ఈ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ డిమాండ్
సిద్దిపేట జనవరి 5 ప్రశ్న ఆయుధం :
ప్రభుత్వ విధానాలతో విద్యుత్ సంస్థలు నష్టంలోకి పోతున్నాయని, వాటిని సాకుగా చూపి విద్యుత్ రంగాన్ని ప్రైవేటుపరం చేయడానికి మోడీ సర్కార్ ప్రయత్నాలు చేస్తుందని ఈఈఐఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి సుదీప్ దత్ ఆరోపించారు.
టీజీయూఈఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ సూచించారు. విద్యుత్ రంగంలో ఉద్యోగుల నియామకం జరగక ఉన్న ఉద్యోగులపై పని భారం పడి ఒత్తిడి పెరిగిందన్నారు. గత ప్రభుత్వం 20 వేల మందిని రెగ్యులర్ చేస్తామని చెప్పి ఆర్టిజన్ గా నామకరణం చేసి, తక్కువ వేతనాలకు పని చేయించుకుంటున్నారని, వారికి వేతనాలు పెంచాలని, అన్ మెన్ కార్మికులు సమానంగా విధులు నిర్వహిస్తున్న వేతనాలు తక్కువగా వచ్చి చాలీచాలని జీతాలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి సమాన వేతనం ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం గృహ జ్యోతిని అమలు చేస్తుందని, ప్రవేట్ పీస్ రేట్ వర్కర్లతో పని చేయించుకుంటుందని, వారిని కూడా రెగ్యులరైజ్ చేయాలని, విద్యుత్ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, జిపిఎఫ్ ను అందించాలని, ఇతర రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న పాత పెన్షన్ విధానాన్ని ఇక్కడ కూడా అమలు చేయాలని మహాసభలో తీర్మానం చేసినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్తు రంగాన్ని ప్రైవేటీకరించడానికి చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. 2022 విద్యుత్ సవరణ చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, చండీగర్ లో విద్యుత్తు రంగాన్ని ప్రైవేటీకరణ చేయడానికి వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో ఉన్న విద్యుత్ వినియోదారులకు ఒక్క యూనిట్ ను రూ 2.40 నుండి 4.50 ధరతో అందిస్తున్నారని, ప్రవేట్ పరమైతే ఒక యూనిట్ కి రూ 8 – 12 పెరిగే అవకాశం ఉందని, ఉచిత విద్యుత్ అంది అవకాశం లేదన్నారు. రాష్ట్రంలో 90 శాతం వ్యవసాయం బోర్ బావులపై ఆధారపడి జరుగుతుందని, ఇక్కడ ఉచిత విద్యుత్తు ఇవ్వకపోతే బోర్ బావులపై ఆధారపడి పని చేస్తున్న రైతులందరిపై భారం పడుతుందని, అప్పుడు వ్యవసాయం సంక్షోభంలో పడుతుందని అన్నారు. ఉద్యోగులకు, ప్రజలకు, రైతులకు అందరికీ ప్రైవేటీకరణ జరిగితే నష్టమవుతుందన్నారు. సిఐటియు యూనియన్ ఆధ్వర్యంలో విద్యుత్ రంగంలో పనిచేస్తున్న వారందరం ఏకమై ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ మహాసభలో సిఐటియు జిల్లా కార్యదర్శి గోపాలస్వామి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన రాళ్ల బండి శశిధర్, యూనియన్ కంపెనీ అధ్యక్షులు సింగిరెడ్డి చంద్రారెడ్డి, యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాట మధు, యూనియన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గుంటుపల్లి సధాకర్, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్, యూనియన్ జిల్లా అధ్యక్షులు ర్యాకం అశోక్, నాయకులు నాగేందర్ రెడ్డి, రవికుమార్ గౌడ్, శ్రావణ్, గిరి గౌడ్, కనకరాజు, పరశురాములు, భూపతి రాజు, భాస్కర్ జిల్లాల నుండి ప్రతినిధులు పాల్గొన్నారు.