దోమకొండ మండల కేంద్రంలో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం
– ఫిర్యాదుల అందిన పట్టించుకోని విద్యుత్ శాఖ అధికారులు
ప్రశ్న ఆయుధం ఫిబ్రవరి 23
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో మటన్ మార్కెట్ రోడ్డులో ఉన్న విద్యుత్ స్తంభం ఇప్పుడు కింద పడుతోంది తెలియని పరిస్థితి లో ఉంది. ఈ యొక్క విద్యుత్ స్తంభం యొక్క పరిస్థితి స్థానికులు ఎన్నోసార్లు విద్యుత్ శాఖ అధికారులకు విన్నవించిన, దరఖాస్తులు చేసిన సారి చేస్తామని చెప్పడమే తప్ప ఇంతవరకు ఈ స్తంభాన్ని మార్చలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . ఆ చుట్టుపక్కల ఉండే ప్రజలు ఇప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళనలో ఉన్నారు. వచ్చే వేసవిలో వడ గాల్పులు వీచిన, వడగళ్లతో వర్షాలు పడిన, స్తంభం విరిగిపోతే ప్రమాదం జరిగిన విద్యుత్కురాయం జరిగిన తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొంటున్నారు. దోమకొండ మండలంలో విద్యుత్ శాఖ అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. గతంలో చాలాసార్లు, పలు కాలనీలలో ఇలాంటి సమస్యలు ఎదురైనా అధికారులు నిర్లక్ష్యంగానే ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలిగిన వెంటనే మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు