డీజీపీ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న పీఆర్ వో నాగరాజు

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబరు 12 (ప్రశ్న ఆయుధం న్యూస్): తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని పెట్లబుర్జ్ సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ (సీపీటీసీ)లో మూడు రోజుల పాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ల (పీఆర్ వోస్) శిక్షణా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమం ముగింపు సమావేశానికి రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శివధర్ రెడ్డి ప్రధాన అతిథిగా హాజరై, శిక్షణలో పాల్గొన్న అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా పీఆర్ వో పి.నాగరాజు శిక్షణను విజయవంతంగా పూర్తి చేసి, రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐజీపీ (పి&ఎల్) రమేష్ రెడ్డి, డీసీపీ (కార్) రక్షిత మూర్తి, శిక్షణా సమన్వయకర్త మధుసూదన్, తెలంగాణ సురక్ష బృంద సభ్యులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment