నేపాల్ ముక్తినాథ్ ఆలయం దర్శించుకున్న ప్రభాకర్ పంతులు
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట లోగల ప్రముఖపుణ్యక్షేత్రం బుగ్గరామలింగ స్వామి ఆలయం ప్రధాన పూజారి ప్రభాకర్ పంతులు గారు వారి శిష్యుల బృందం తో కలిసి ప్రపంచం ప్రసిద్ధి గాంచిన నేపాల్ దేశం లొని అతి ఎత్తయినా శిఖరాలు కొండలలో వెలసిన ముక్తినాథ్ శివాలయం ను అతికష్టం మీద ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కొండాలనుండి పెద్ద పెద్ద బండారళ్ళు పడుతున్న లెక్క చేయకుండా భగవంతుని పై భారం వేసి వాతావరణం -10 డిగ్రీలు (మైనస్ )ఉష్ణగ్రతా వున్నప్పటికి సహసొ పేతంగా దర్శనం చేసుకున్నారు. పంతులు మాట్లాడుతు నేను ఆదినుండి శివా భక్తున్ని ఎన్నో యాత్రలు తిరిగి దేవాలయం లు దర్శనం చేసుకున్నాను.. ఈ నేపాల్ దేశం ప్రాంతంలో మాత్రం నిర్మల మైన మనసుతో మొక్కులు మొక్కితే అనుకున్న కోరికలు నెరవేరుతాయన్నారు. ఈ దేవాలయం ప్రాంతం లో 108 జల దారలు కలిగిన జలం తో మా ప్రాంతం భారీ వర్షాలతో జలకళ కావాలన్నారు.మన కామారెడ్డి ప్రాంతం పూర్తిగా వర్షాలు ఆదరితా వ్యవసాయం ఉంటుంది. రెండు నెలలుగా వర్షాలు లేక సాగునిటికి,, తాగు నీటికి ప్రజలు నానా కష్టాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు . దేవుడు కరుణించి మంచి వర్షాలు కురవాలని మన ప్రాంతం పాడిపంటల తో కళకల్లాడలని మొక్కుకున్నట్లు నేపాల్ దేశం నుండి చరవాణి లో తెలిపారు.వారితో పాటుగా లోక కళ్యాణం కోసం వెళ్లిన వారిలో మద్దికుంట పురాప్రముఖులు మాజీ సర్పంచ్ రవి, నిత్యం పూజారి గణేష్, ఆలయం చైర్మన్ లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.