*హోటల్ అంజమ్మ పేరు చెప్పగానే “సాయం చేసే మనిషి” అనే బిరుదు.*
*హోటల్ అంజమ్మ కుమారుడు శ్రీనివాస్ గౌడ్.*
*సర్పంచ్ రేసులో శ్రీనివాస్ గౌడ్‌కు ప్రజల మద్దతు.*
*30 ఏళ్ల రాజకీయ ప్రయాణం… సేవే ధర్మం.*
*పుస్తె మెట్టల నుండి ప్రజాసేవల వరకు అంజమ్మ విలువల వారసుడిగా శ్రీనివాస్ గౌడ్*
*ప్రగతి ధర్మారం ఎన్నికల్లో సేవా శక్తి ప్రభావం.*
*సేవా పరంపరతో ముందుకు సాగుతున్న నాయకుడు శ్రీనివాస్ గౌడ్*
ఉమ్మడి మెదక్ బ్యూరో, డిసెంబర్ 4 (ప్రశ్న ఆయుధం న్యూస్): మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో స్థానిక స్వపరిపాలన ఎన్నికల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ ఎన్నికల్లో గ్రామానికి చెందిన హోటల్ అంజమ్మ కుమారుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీనివాస్ గౌడ్ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలవడం గ్రామ రాజకీయాలకు కొత్త ఊపునిచ్చింది. మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో క్రమ శిక్షణతో పని చేస్తూ, గ్రామ అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండే నాయకుడిగా ఆయన పేరు సంపాదించుకున్నారు. గతంలో పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా పని చేస్తూ గ్రామ ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకున్నారు. అయితే శ్రీనివాస్ గౌడ్ తల్లి హోటల్ అంజమ్మ గ్రామంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా, ఏ ఆపద వచ్చినా అంజమ్మ వెంటనే సహాయం అందించేవారని గ్రామస్థులు గుర్తు చేసుకుంటున్నారు. పెళ్లిళ్లకు పుస్తెమెట్టలు, బట్టలు, ఆర్థిక సహాయం, అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలకు భోజనం, మందులు అందించడం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలతో అంజమ్మ దాదాపు ప్రతి ఇంటి మనస్సులో స్థానం సంపాదించింది. పేదలకు భరోసా, అవసరంలో అండగా నిలిచే ఆ అంజమ్మ—తనదైన విలువలు, మానవీయతను చాటుకున్నారు. గ్రామంలో అంజమ్మ పేరు చెప్పగానే “సాయం చేసే మనిషి” అనే గుర్తింపు వెంటనే వస్తుంది. ఈ సేవా పరంపరే ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ సర్పంచ్ పోరులో ప్రధాన బలం అవుతోంది. గ్రామ ప్రజలు చెబుతున్న మాటల్లోనూ ఇదే స్పష్టమవుతోంది. అంజమ్మ చేసిన సేవలు మేము మరవం. ఆమె కొడుకు శ్రీనివాస్ గౌడ్ కూడా అదే నిబద్ధతతో గ్రామం కోసం పని చేస్తాడు. ఈసారి ఆయన గెలుస్తాడని మా నమ్మకం పలువురు గ్రామస్తులు పేర్కొన్నారు. తమ కుటుంబం చేసిన సేవలకు ప్రతిఫలం ఇవ్వాలనే భావన గ్రామ ప్రజల్లో కనిపిస్తోంది. అంజమ్మ చేసిన మానవీయ సేవలు, శ్రీనివాస్ గౌడ్ నాయకత్వ సామర్థ్యం కలిసిపోవడంతో ఆయన విజయం సాధ్యం అని పలువురు పేర్కొంటున్నారు. ప్రగతి ధర్మారం సర్పంచ్ పోటీ ఈసారి సేవా విలువలు, విశ్వాసం, గ్రామాభివృద్ధి ఆధారంగా సాగుతుండడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.