
స్థానిక ప్రభుత్వ డిగ్రీ మరియు పి.జి స్వయం ప్రతిపత్తి కళాశాల భద్రాచలం, తెలుగు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని పురస్కరించుకొని వ్యవహారిక భాషా దినోత్సనాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రధానాచార్యులు డా. జాని మిల్టన్ ముఖ్య అతిథులుగా విచ్చేసి, వ్యవహారిక భాష గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా తెలుగు విభాగాధిపతి డా. కపిల భారతి, తెలుగు అధ్యాపకులు డా. నండూరి రాంబాబు, జాయ్ కిరణ్, వీరన్న, చరిత్ర అధ్యాపకులు డా. కిరణ్ కుమార్ , రసాయనశాస్త్ర అధ్యాపకులు శ్రీ.సుధాకర్, మరియు అధ్యాపకులు అధ్యాపకేతరులు విద్యార్ధులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవతంచేసిరి.