Headlines in Telugu
-
“ప్రముఖంగా ప్రజా పాలన విజయోత్సవాల వేడుకలు ప్రారంభానికి సన్నాహాలు”
-
“భద్రాద్రి కొత్తగూడెం నుండి 540 మంది మహిళల పాల్గొనరిక”
-
“మహిళల రవాణా, సౌకర్యాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు”
-
“వరంగల్ వేదికగా మినహాయించిన పథకాల విజయోత్సవం”
-
“ఇండిరా మహిళా శక్తి భవనాల శంకుస్థాపనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి”
జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్
ప్రభుత్వం ఏర్పడి తొలి ఏడాది కాలంలో సాధించిన విజయాలు చేపట్టిన కార్యక్రమాలు వివిధ పథకాలను విస్తృతంగా ప్రజల్లో కి తీసుకు వెళ్ళుటకు గాను ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టనున్న ప్రజా పాలన ప్రజా విజయోత్సవ కార్యక్రమాలను విజయవంతం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈనెల 19న వరంగల్ లో నిర్వహించు ప్రజా పాలన – విజయోత్సవాల వేడుకలకు జిల్లా నుండి మహిళా సంఘాల మహిళలను భాగస్వాములు చేయుటకు గాను చేయాల్సిన ఏర్పాటలపై జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన తో ఎంపీడీవోలు, ఆర్టీసీ అధికారులు మరియు సంబంధిత అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా 19వ తారీఖు వరంగల్ వేదికగా 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన కార్యక్రమానికి మరియు ప్రజా పాలన విజయోత్సవ వేడుకలకు జిల్లా నుండి పెద్ద ఎత్తున మహిళలను తీసుకువెళ్లాలని అధికారులు ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా నుండి పెద్ద ఎత్తున మహిళా సంఘాల సభ్యులను ప్రజా పాలన విజయోత్సవాల వేడుకలకు హాజరు అయ్యేలా ప్రణాళికలు చేపట్టాలన్నారు.జిల్లా నుండి 12 బస్సుల్లో బస్సు కు 45 మంది చొప్పున 540 మంది మహిళలను కార్యక్రమంలో పాల్గొనాలని అన్నారు. దూరంగా వున్న మండలా బస్సులు ఉదయం ఏడు గంటలకు, మిగిలిన మండలాల బస్సులు ఎనిమిది గంటలకు మండల కేంద్రం నుండి బయలుదేరాలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో పాల్గొనే మహిళలందరికీ ఐడీ కార్డులు అందించాలని, అదేవిధంగా ప్రతి ఐడి కార్డు వెనకాల సంబంధిత ఏపిఎం ఫోన్ నెంబర్లు ఉండాలని అధికారులను సూచించారు. కార్యక్రమానికి హాజరైన మహిళలకు ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. బస్సుల్లో మహిళలకు త్రాగునీరు, అల్పాహారం ఏర్పాటు చేయాలని అన్నారు. అన్ని బస్సులు ఒకే రూట్లో వరంగల్ చేరుకునేలా రూట్ మ్యాప్ ను సిద్ధం చేయాలన్నారు. బస్సులన్నిటికీ బ్యానర్లు సిద్ధం చేయాలి అన్నారు. మహిళలకు నర్సంపేటలో మధ్యాహ్నం మరియు రాత్రి భోజనం సౌకర్యాలు ఏర్పాటు చేయాలని దానికి తగిన చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో పాల్గొనే మహిళల అందరి వివరాలు మరియు ఫోన్ నెంబర్లు నమోదు చేయాలన్నారు. అన్ని మండలాల్లోనే ఏపీఎంలు తమ పరిధిలోని ఉత్సాహవంతులైన మహిళా గ్రూపు సభ్యులను గుర్తించి ఈ కార్యక్రమానికి తీసుకురావాలని అన్నారు. మహిళలు కేవలం కార్యక్రమంలో పాల్గొనటం మాత్రమే కాకుండా అక్కడ వివిధ జిల్లాలు వారు ఏర్పాటుచేసిన స్టాల్ లను చూడడం ద్వారా మన జిల్లాలో కూడా ఆ ఆలోచన లు అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందన్నారు.ఆర్టీసీ అధికారుల ను మహిళల తరలింపుకు అవసరమైన బస్సుల వివరాలు అందించాలని ఆదేశించారు. అన్ని మండలాల ఏపిఎం లు మరియు సీసీలు కార్యక్రమం అనంతరం మహిళలు ఎవరు మిగిలిపోకుండా అందరిని గమ్యస్థానాలకు చేర్చేలా చర్యలుచేపట్టాలని ఆదేశించారు.మహిళలు గమ్యస్థానం చేరుకునేంతవరకు వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు.మహిళలందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు.