కేఏ పాల్ అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్…తగ్గేదే లే.. అంటున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్…

 *కేఏ పాల్ అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్…తగ్గేదే లే.. అంటున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్…*

కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రజాశాంతి పార్టీలో చేరండి…

కోమటిరెడ్డి బ్రదర్స్ రేవంత్ రెడ్డి కన్నా వెయ్యిరెట్ల బలం కలిగిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు..

ఒక బ్రదర్ సీఎం క్యాండిడేట్ అయితే తమ్ముడు హోమ్ మినిస్టర్ క్యాండిడేట్ కలిగిన వాళ్లు…

ఇంత బలం ఉన్నా గాని నల్లగొండ జిల్లాకు వీరు చేసిందేమీ లేదు… అభివృద్ధి మాత్రం జీరో…

రోడ్లు భవనాల శాఖ మంత్రి సొంత జిల్లాలో రోడ్లు అద్వానంగా ఉన్నాయి…

దేవరకొండ నుంచి నల్లగొండ రోడ్డు మార్గం ప్రయాణం చేస్తే చాలు వీరి పాలన ఎలా ఉందో తెలిసిపోతుంది ప్రజలకు…

ఇతర పార్టీలు శంకుస్థాపన చేసిన వాటిని ప్రారంభం చేసి మేమే చేశామని కాంగ్రెస్ పార్టీ గప్పాలు కోస్తున్నారు…

నల్లగొండ దత్తత తీసుకుంటా అన్న కేసీఆర్ కనుమరుగైపోయాడు…

రాష్ట్రంలో రేవంత్ రెడ్డి RR tax వసూళ్లు చేస్తున్నారని నాకు ఫిర్యాదులు వస్తున్నాయి…

కేటీఆర్ తప్పులు చెస్తే అరెస్టు చేయండి. కానీ రాజకీయ కక్షతో కాదు…

వందల మంది తప్పులు చేసారు, మోసం చేశారు.. వాళ్ళను రేవంత్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేయడం లేదు…

ఆర్ కృష్ణయ్య లాంటి మంచి నేత కూడా బీజేపీ కీ సపోర్ట్ చేయడం బాధాకరం…

గత పాలకులు, ప్రస్తుత పాలకులు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలా చేసారు…

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు కే ఏ పాల్ పార్టీకి మద్దతు ఇవ్వాలి…

రేవంత్ రెడ్డి అధికారం వచ్చాక ఇంకా లక్ష కోట్లు తెలంగాణ ప్రభుత్వం అప్పు చేసింది…

ఆర్ఆర్ టాక్స్ రేవంత్ రెడ్డి టాక్స్ కట్టించుకుంటున్నారు…

ఆర్ఆర్ టాక్స్ కట్టని వారి బిల్డింగులు హైడ్రా పేరుతో 432 బిల్డింగులు కూల్చారు…

పర్మిషన్లు ఇచ్చిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను, ఇంజనీర్లను, ఎందుకు అరెస్టు చేయడం లేదు…

ఔటర్ రింగ్ రోడ్డు మాటల్లోనే గాని చేతల్లో లేదు…

ఐదు శాతం ఉన్న రొటీన్ 12సార్లు ముఖ్య మంత్రి పదవులు అనుభవించారు..

60 శాతం ఉన్న బీసీలు ఆంధ్ర తెలంగాణలో ఒక్క బీసీ ముఖ్యమంత్రి కాలేదు…

కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు ఒకటే బీసీలపై ప్రేమ ఉంటే బిసి ముఖ్యమంత్రిని ప్రకటించారు…

మీరందరూ రాజీనామా చేసి ప్రజాశాంతి పార్టీలో చేరితే కచ్చితంగా గెలుస్తారని మీకు కూడా తెలుసు…

100% అభివృద్ధి నేను చేస్తానని, అప్పులు కూడా మీకు తెలుసు…

కాంగ్రెస్ టిఆర్ఎస్ వీరిద్దరి వల్ల అభివృద్ధి కాదని ప్రజలకు తెలిసిపోయింది…

బిజెపి పార్టీ నామమాత్రం గానే ఉంది…

అందుకే ఈ పార్టీలను గుడ్ బై చెప్పి బీసీ మద్దతు పార్టీగా ప్రజాశాంతి పార్టీలో చేరండి…

ఈసారి సర్పంచ్ ఎన్నికలొ గెలిచేవారు మా పార్టీలోకి రండి ఊర్లను అభివృద్ధి చేస్తాను…

తెలంగాణను బంగారు తెలంగాణగా మారుస్తాను…

ఈసారి తెలంగాణలో బీసీ పాలన రావాలి అని కోరుకుంటున్నాను…

ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు 2000/3000రూ ఇచ్చి ఓటర్లను గొర్రెలుగా తయారు చేస్తున్నారు…

సర్పంచ్ ఎన్నికల్లో మా పార్టీలో చేరండి సర్పంచులుగా గెలవండి వంద రోజుల్లోనే అభివృద్ధి ఏంటో చూపిస్తాను…

మోహన్ బాబు తో మాట్లాడించి మీడియాతో క్షమాపణలు చెప్పించాను..

చంద్రబాబు రేవంత్ రెడ్డి గురు శిష్యులు… ఎవరి పాలన బాగుందంటే ఎవరు మర్డర్ బాగా చేశారు.. అడిగినట్లుంది..

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్..

Join WhatsApp

Join Now