తాత్కాలిక మార్పులతో యధావిధిగా ప్రజావాణి
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్
ప్రశ్న ఆయుధం
: కామారెడ్డి జిల్లా నవంబర్ 29
కామారెడ్డి జిల్లాలో గ్రామ పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో ‘ప్రజావాణి’ విధుల్లో మార్పులు
డిసెంబర్ 1, 8, 15 తేదీల్లో కలెక్టరేట్ మిని సమావేశ మందిరంలో ప్రజావాణి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు . ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో, జరుగనున్న గ్రామ పంచాయితీ ఎన్నికల కారణంగా తాత్కాలిక మార్పులు చేయడం జరిగినట్లు పేర్కొన్నారు.
సంబంధిత అధికారులు ఎన్నికల విధుల్లో పాల్గొనాల్సి ఉండటంతో, ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఈ మార్పులు ప్రవేశపెట్టినట్లు కలెక్టర్ తెలిపారు.
ఇదనుగుణంగా డిసెంబర్ 1, 8, 15 తేదీల సోమవారాల్లో ప్రజల నుండి వచ్చే దరఖాస్తులను కలెక్టరేట్ లోని 25వ నంబర్ గది — ప్రజావాణి మిని సమావేశ మందిరంలో స్వీకరించనున్నట్లు వెల్లడించారు.
గ్రామ పంచాయితీ ఎన్నికల నిర్వహణతో పాటు ప్రజల సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు.
ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని, తమ వినతులు, సమస్యలను నిర్ణీత తేదీల్లో సమర్పించాలని జిల్లా కలెక్టర్ కోరారు.