Site icon PRASHNA AYUDHAM

అర్జీ దారుల సమస్యల పరిష్కారానికే ప్రజావాణి

IMG 20240930 WA02051

అర్జీ దారుల సమస్యల పరిష్కారానికే ప్రజావాణి

జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

ప్రశ్న ఆయుధం న్యూస్, సెప్టెంబర్ 30, కామారెడ్డి :

అర్జీ దారుల సమస్య పరిష్కరించేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నదని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం రోజున సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ఏర్పాటుచేసిన ప్రజావాణి లో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల అర్జీలను కలెక్టర్ స్వీకరించి, వాటిపై సంబంధిత అధికారులు పరిశీలించి చర్య తీసుకునే విధంగా సూచించారు. ప్రజల సమస్యలపై అధికారులు స్పందించి అర్జీదారునికి సమస్యపై సమాధానం అందజేయాలని సూచించారు. ఈ ప్రజావాణి లో (74) దరఖాస్తులు రావడం జరిగాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జడ్పీ సీఈవో చందర్ నాయక్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి సురేందర్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version