కంభం, బేస్తవారపేట పోలీస్ స్టేషన్ లను ఆకస్మిక తనిఖీ చేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ 

*కంభం, బేస్తవారపేట పోలీస్ స్టేషన్ లను ఆకస్మిక తనిఖీ చేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్

* IMG 20250202 WA0085

, ఫైల్స్ తనిఖీ… సిబ్బంది పని తీరుపై ఆరా*

*పెండింగ్ కేసులపై అధిక దృష్టి సారించి త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయాలి: జిల్లా ఎస్పీ

*IMG 20250202 WA0081 పట్ల అంకితభావంగా ఉంటూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి*.

*సైబర్ నేరాలను చేధించటం కంటే నివారణ ఉత్తమ మార్గం*

పోలీస్ స్టేషన్ స్థితిగతులు, సిబ్బంది పని తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించడానికి కంభం మరియు బేస్తవారపేట పోలీస్ స్టేషన్ లను ఆదివారం జిల్లా ఎస్పీ ఆకస్మికంగా సందర్శించి, తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగంగా స్టేషన్ పరిసరాలు, వివిధ గదులు, విధుల్లో ఉన్న సిబ్బంది పనితీరు, డ్యూటీల కేటాయింపు, రిసెప్షన్ కౌంటర్ నిర్వహణ, ఫిర్యాదుల స్వీకరణ విధానం, రికార్డ్స్, సీడీ ఫైల్స్, పోలీస్ క్వార్టర్స్, ప్రాపర్టీ రికవరీ, స్టేషన్ పరిధిలోని మ్యాప్ మరియు తదితర అంశాలను పరిశీలించి, రికార్డ్స్ నిర్వహణలో సంతృప్తి వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ లో మొక్కల నాటి, ఆవరణ పరిశుభ్రంగా, పచ్చదనం ఆహ్లాదకరంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు.

పోలీస్ స్టేషన్ పరిధిలో లా అండ్ ఆర్డర్, నేర నివారణ వ్యూహాలపై తీసుకుంటున్న చర్యలపై అధికారులను ఆరా తీసి పలు సూచనలు చేసారు. పెండింగ్ కేసులలో విచారణ త్వరగతిన పూర్తి చేయాలని, కేసుల విచారణకు చేపట్టవలసిన విధానం గురించి దిశానిర్దేశం చేశారు. నమోదైన కేసులను త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చూడాలని, కేసుల పరిష్కారంలో జాప్యం వహించే కొలది బాధితులకు సత్వర న్యాయం అందించలేమని కనుక దానికి అనుగుణంగా పోలీస్ స్టేషన్ యొక్క నిర్వహణ ఉండాలని సూచనలు చేశారు.

నేరాలు కట్టడికి గస్తి ముమ్మురం చేయాలని, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నిరంతర గస్తీ నిర్వహించేటట్లు, నైట్ బీట్ డ్యూటీ చేస్తున్న సిబ్బందిని తరచూ అప్రమత్తంగా చెయ్యాలని, డయల్-112 ఫిర్యాదులు రాగానే వెంటనే స్టేషన్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య ను పరిష్కరిoచేటట్లు చూడాలని, విరివిగా విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలని, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, స్టేషన్ లో వివిధ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, విధుల పట్ల అంకితభావంగా ఉంటూ ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలన్నారు.

ప్రజలకు సిసి కెమెరాల పట్ల అవగాహన కల్పించి వాటి ప్రాముఖ్యతను వివరిస్తూ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ ను క్రమబద్దీకరించాలని పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ  ఆదేశించారు.

గుడ్ టచ్ & బ్యాడ్ టచ్ పై విస్తృతంగా స్కూల్/కళాశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పించాలని, గంజాయి వంటి మాదక ద్రవ్యాలు సేవించడం వల్ల కలిగే దుష్ప్రభావాలు, చట్టపరమైన చర్యల గురించి, సైబర్ నేరాలపై ప్రజలు మరియు విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు.

అనంతరం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అందరితో మాట్లాడుతూ అందరి యొక్క ఆరోగ్య పరిస్థితులను గూర్చి ఆరా తీశారు. వృత్తిపరంగా, ఆరోగ్యవరంగా, కుటుంబ వరంగా ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నది, మొదలైన విషయాలను వారితో ముఖాముఖి మాట్లాడారు. సిబ్బంది సంక్షేమానికి ఎల్లవేళలా కృషి చేస్తామన్నారు.

పోలీసు స్టేషన్ కు ఫిర్యాదు చేయుటకు వచ్చే ఫిర్యాదులుదారులు పట్ల, మర్యాదపూర్వకంగా మాట్లాడి వారి యొక్క సమస్య తెలుసుకొని వెంటనే విచారణ చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఎస్పీ సూచించారు.

జిల్లా ఎస్పీ వెంట మార్కాపురం డిఎస్పీ నాగరాజు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, కంభం సీఐ మల్లికార్జున రావు, కంభం ఎస్సై నరసింహారావు, బివి పేట ఎస్సై రవీంద్ర బాబు మరియు సిబ్బంది ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment