*పిఎసిఎస్ తనుగుల ఛైర్మెన్ ను పరామర్శించిన ప్రణవ్*
*జమ్మికుంట జులై 18 ప్రశ్న ఆయుధం*
మండలంలోని పిఎసిఎస్ తనుగుల చైర్మన్ పోల్సాని వెంకటేశ్వరరావు ప్రమాదవశాత్తు గాయపడగా చికిత్స పొందుతున్న ఆయనను కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ ఓడితెల ప్రణవ్ శుక్రవారం రోజున హన్మకొండలోని రోహిణి ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు అనంతరం ఆయనకు అందుతున్న చికిత్స గురించి డాక్టర్లను అడిగి తెలుసుకొని,మెరుగైన చికిత్స అందించాలని కోరారు.అయన వెంట జమ్మికుంట మండల అధ్యక్షుడు పరుశురాం రావు,హుజూరాబాద్ మండల అధ్యక్షుడు కొల్లూరి కిరణ్,పాక్స్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి,మాజీ ఎంపీటీసీ సంజీవ్ రెడ్డి పాల్గొన్నారు.