Site icon PRASHNA AYUDHAM

మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలునీ పరామర్శించిన ప్రణవ్

IMG 20250516 WA2153

*మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలునీ పరామర్శించిన ప్రణవ్*

*ఇల్లందకుంట మే 16 ప్రశ్న ఆయుధం*

కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కోడం రజిత ఇటీవల ప్రమాదవశాత్తు కాలుకు గాయం కాగా విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ వోడితల ప్రణవ్ శుక్రవారం ఇల్లందకుంట మండలంలోని పాతర్లపల్లి గ్రామములోని రజిత నివాసానికి వెళ్ళి పరామర్శించారు. ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వారి ఇంటికి వెళ్లి రజిత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాధానికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం కుదుటపడే వరకు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు పెద్ది కుమార్, సుంకరి రమేష్, గూడెపు సారంగపాణి,తోట స్వప్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version