*డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించిన ప్రణవ్*
*పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కూడా ఏందుకు పంచలేదు? నిరుపయోగముగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు*
*ఎంపీగా బండి సంజయ్ విఫలం*
జమ్మికుంట,ఉప్పల్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి సహకరించాలి*.
*హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్*
*హుజురాబాద్ ఫిబ్రవరి 4 ప్రశ్న ఆయుధం*
హుజురాబాద్ పట్టణంలోని 2వ వార్డు గణేష్ నగర్ లో గల డబుల్ బెడ్ రూమ్ లను పరిశీలించారు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ హుజురాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ లను గుంటలేని అర్హులైన నిరుపేద లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇందిరమ్మ ఇళ్లను పంపిణీ చేస్తామని తెలిపారు వందల కోట్లు ఖర్చుచేసి కట్టిన ఇళ్ళు నిరుపయోగంగా మిగిల్చారని ప్రజాధనాన్ని బీఆర్ఎస్ దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు ప్రభుత్వ విప్,ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో కౌశిక్ రెడ్డి పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇళ్ల రిపేర్ల గురించి త్వరలోనే గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి,జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ కు సమస్యను వివరించి నిధులు తేవడానికి కృషి చేస్తానని తెలిపారు.
*కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం*
కేంద్ర ప్రభుత్వం,ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారనీ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ అన్నారు.కరీంనగర్ ఎంపీగా,కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంటు అభివృద్ధికి కేంద్ర బడ్జెట్ లో నిధులు తేవడంలో విఫలమయ్యారని,రాష్ట్రం నుండి ఎనమిది మంది ఎంపిలు,ఇద్దరు కేంద్ర మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రానికి రావాల్సిన నిధులు తేలేదని అన్నారు.హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట రైల్వే స్టేషన్ అభివృద్ధికి పదేళ్లుగా సహకరించలేదని,కమలాపూర్ మండల పరిధిలోని ఉప్పల్ రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జికి ఈ బడ్జెట్ లో కూడా మొండి చెయ్యి చూపించారని,ప్రజల అవసరాలను తీర్చడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు.గతంలో 2009 లో ఎంపీగా పొన్నం ప్రభాకర్ చేసిన అభివృద్ధి పనులే ఇప్పటికీ సాక్ష్యాలుగా ఉన్నాయని అన్నారు.మరోవైపు గతంలో హుజురాబాద్ నుండి ప్రాతినిధ్యం వహించిన ఈటెల కూడా ఉప్పల్ రైల్వే పనులకు సహకరించకపోవడం అన్యాయమని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.