*హుజురాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం…ప్రణవ్*
*
*2వవార్డు కాలనీల సమస్యలపై ప్రణవ్ కి విన్నపం,అండగా ఉంటామని భరోసా*
*హుజురాబాద్ ఫిబ్రవరి 4 ప్రశ్న ఆయుధం*
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపాలిటీ లోని రెండవ వార్డులో గల గణేష్ నగర్ ను హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి పర్యటించారు అనంతరం స్థానికులు అక్కడున్న పరిస్థితులను,సమస్యలను ప్రణవ్ కు విన్నవించారు డ్రైనేజ్,త్రాగు నీరు సమస్య ఉందని వివరించగా వెంటనే సంభంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యను పరిష్కరించాలని కోరారు అదేవిధంగా కాలనీలో ఉంటున్న వారికి అర్హులైన ప్రతి లబ్ధిదారునికి రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని తెలిపారు అనంతరం హుజరాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.