Site icon PRASHNA AYUDHAM

మంత్రి పొన్నం కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రణవ్

IMG 20250508 WA2671

*మంత్రి పొన్నం కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రణవ్*

*నియోజకవర్గ వ్యాప్తంగా పొన్నం జన్మదిన వేడుకలు*

*దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన నాయకులు*

*యూత్ కాంగ్రెస్ 58 వ పుట్టినరోజు 58 మందితో రక్తదాన శిబిరం*

*హుజురాబాద్ మే 8 ప్రశ్న ఆయుధం*

రాష్ట్ర రవాణా,బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 58వ జన్మదిన వేడుకలు హుజురాబాద్ నియోజకవర్గం వ్యాప్తంగా అన్ని మండలాల్లో హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మంత్రి పొన్నంను హైదరాబాద్ లో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రణవ్ కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో ముందుండి కొట్లాడిన వ్యక్తి,నిజమైన ఉద్యమకారుడు పొన్నం ప్రభాకర్ అని,వారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ బిల్లులో తనదైన ముద్ర వేస్తూ బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించడంలో విశేష కృషి చేశారని,భవిష్యత్ లో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరారు.

Exit mobile version