జన్ సురాజ్ నేత, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. కొత్త పార్టీ పేరు, నాయకత్వం తదితర వివరాలను అక్టోబర్ 2వ తేదీన ప్రకటిస్తామని తెలిపారు. 2022 అక్టోబర్ 2న ‘జన్ సురాజ్’ పేరుతో ఆయన ప్రారంభించిన యాత్ర రెండేళ్ల పూర్తి చేసుకోనున్న సందర్భంగా పాట్నాలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ క్రమంలో వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు పేర్కొన్నారు…