Headlines
-
మానాల మోహన్ రెడ్డి విమర్శలు: ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధి పథకాలను త్వరగా అమలు చేస్తోంది
-
బీఆర్ఎస్ పై ఎద్దేవా: ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డిపై మానాల మోహన్ రెడ్డి విమర్శలు
-
మహిళల సంక్షేమం: మానాల మోహన్ రెడ్డి ప్రభుత్వం హక్కులు కాపాడాలని ప్రకటన
-
బహిరంగ చర్చకు సవాల్: డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి
-
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు: జనవరి నుంచి ప్రారంభం, మానాల మోహన్ రెడ్డి ప్రకటించారు
పది నెలల్లో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి సంక్షేమంపై దమ్ముంటే చర్చకు రండి..
మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు వారికి లేదు:డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి
బాల్కొండ ఎమ్మెల్యే
ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి తోడు దొంగలని డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి విమర్శించారు.జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..పదేళ్లలో బీఆర్ఎస్ చేయని అభివృద్ధి, అమలు చేయని సంక్షేమ పథకాలను తమ కాంగ్రెస్ ప్రభుత్వం పదినెలల కాలంలోనే చేసిందని, దమ్ముంటే ప్రశాంత్, జీవన్ బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.బహిరంగ చర్చకు ఆహ్వానించినా వారు స్పందించడం లేదని ఎద్దేవా చేశారు.రైతాంగం,పింఛన్లపై వారం రోజులుగా వారిద్దరూ అబ్దాలను ప్రచారం చేస్తున్నారని,మహిళలపై మాట్లాడే నైతిక హక్కు వారికి లేదని విమర్శించారు. జనవరి నుంచి మహిళలకు ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తామన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి,సీనియర్ నాయకులు జావిద్ అక్రమ్, సీనియర్ నాయకుడు నరాల రత్నాకర్,యువజన కాంగ్రెస్ నాయకుడు రామర్తి గోపి తదితరులు పాల్గొన్నారు.