గ్యారా షహీద్ దర్గాలో ప్రతాప్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు

గ్యారా షహీద్ దర్గాలో ప్రతాప్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు

సంపూర్ణ ఆయురారోగ్యాలతో కెసిఆర్ వందేళ్లు ప్రజా జీవితంలో నిమగ్నమవ్వాలి

గజ్వేల్, 16 ఫిబ్రవరి 2025 : గజ్వేల్ గ్యార షహీద్ దర్గా ఉర్సు ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మూతవలీలకు సందేల్ అందజేశారు. రెండు రోజులపాటు ఉర్సు ఉత్సవాలు జరగగా, మతాలకు అతీతంగా ప్రజలు గ్యారా షహీద్ దర్గాను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు నవాజ్ మీరా, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జకియొద్దిన్, పార్టీ నేతలు విరాసత్ అలీ, అత్తెల్లి శ్రీనివాస్ గుప్త, గుంటుకు రాజు, అల్తాఫ్, రియాజ్, జాఫర్ ఖాన్, వాజిద్, మోసిన్, అజీజ్, పర్వేజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, రాష్ట్ర అభివృద్ధి ప్రదాత కెసిఆర్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో ప్రజా జీవితంలో అంకితం అవ్వాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటుండగా, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు సుఖశాంతులతో ఉండాలని గ్యారా షహీద్ దర్గాలో మొక్కుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now