*స్రవంతి జూనియర్ కళాశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు*
*సాంప్రదాయ కళలు, సాంస్కృతిక విలువలు ఉట్టిపడే ముగ్గులు*
*
*జమ్మికుంట, జనవరి11 ప్రశ్న ఆయుధం*
జమ్మికుంట పట్టణంలోని స్రవంతి జూనియర్ కళాశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు.. ఈ సందర్భంగా నిర్వహించిన రంగవల్లుల, కైట్స్ పోటీలు విద్యార్థులలో ఎంతగానో ఆసక్తిని పాల్గొని విద్యార్థులు తమ సృజనాత్మకతను ప్రదర్శిస్తూ అద్భుతమైన రంగవల్లులను రూపొందించారు..కైట్స్ ఎగరవేయడం లో విద్యార్థులు తమ నైపుణ్యం తో అత్యంత దూరం వెళ్లేలా ఎగురవేశారు.. రంగవల్లుల ముగ్గులలో సాంప్రదాయ కళలు, సాంస్కృతిక విలువలు, ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు ఇలా అనేక అంశాలను ఆధారంగా చేసుకుని రంగవల్లులు రూపొందించారు.ఈ పోటీల్లో విద్యార్థులు తమ మిత్రులతో కలిసి పనిచేస్తూ జట్టుగా పోటీ పడ్డారు. ఇది వారిలో సహకార స్ఫూర్తిని పెంపొందిస్తుంది అని కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ పుల్లూరి సంపత్ రావు పేర్కొన్నారు.ఈ పోటీల ద్వారావిద్యార్థులలో కళాత్మక నైపుణ్యాలు పెరుగి సామాజిక స్పృహ పెరుగుతుందని అన్నారు.. ఈ కార్యక్రమంలో న్యాయనిర్ణేతలుగా భౌతిక శాస్త్రం అధ్యపకురాలు సునీత, ఇంగ్లీష్ అధ్యపకురాలు శ్రావణి పాల్గొని రంగవల్లులలో సాంస్కృతిక సాంప్రదాయ కలలను ఉట్టిపడేలా తీర్చిదిద్దిన ముగ్గులలో ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను ఎంపిక చేశారు.. ఈ బహుమతులు గణతంత్ర దినోత్సవం రోజున అందించనునట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్,ప్రిన్సిపాల్ డాక్టర్ పుల్లూరి సంపత్ రావు, నడిపెల్లి శ్రీనివాస్ రావు, అధ్యాపకులు కొండ విజయ్,రహమాన్,కిషన్,సమ్మయ్య,తిరుపతి,అజార్, విద్యార్థులు పాల్గొన్నారు..