Site icon PRASHNA AYUDHAM

దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు తప్పనిసరి: ఫైర్‌ ఆఫీసర్‌ ఆర్ సుధాకర్‌ సూచనలు

IMG 20251019 191624

దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు తప్పనిసరి: ఫైర్‌ ఆఫీసర్‌ ఆర్ సుధాకర్‌ సూచనలు

లైసెన్సున్న షాపుల నుంచే టపాకాయలు కొనండి 

 చైనా టపాకాయలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి (ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 19

 

దీపావళి సందర్భాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా ఫైర్‌ డిస్టిక్‌ ఆఫీసర్‌ ఆర్‌.సుధాకర్‌ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజలు తప్పనిసరిగా లైసెన్సు ఉన్న షాపుల నుంచే టపాకాయలు కొనుగోలు చేయాలని, చైనా టపాకాయలను ఉపయోగించరాదని సూచించారు. టపాకాయలు వెలిగించేటప్పుడు అగర్బత్తి ద్వారా మాత్రమే వెలిగించాలని, పక్కన నీటితో నిండిన బకెట్‌ మరియు బ్లాంకెట్‌ ఉంచుకోవడం ద్వారా చిన్న ఫైర్‌ ఇంజన్‌ ఉన్నట్టే రక్షణ లభిస్తుందని తెలిపారు. పెద్దల సమక్షంలోనే పిల్లలు టపాకాయలు కాల్చాలని, ఇంట్లో కర్టెన్‌లు, అగ్ని అంటుకునే వస్తువులు తొలగించాలని సూచించారు. ఫైర్‌ ప్రమాదం జరిగితే వెంటనే 101 కి కాల్‌ చేయాలని చెప్పారు.

అలాగే టపాకాయల షాపులు రేకులతో మాత్రమే నిర్మించాలి, తడకల షెడ్లు కట్టరాదని హెచ్చరించారు. షాపుల వద్ద 200 లీటర్ల నీటి ట్యాంకులు ఇరువైపులా ఉంచాలని, ఎలక్ట్రిక్‌ భద్రతా చర్యలు పాటించాలని తెలిపారు. టపాకాయల దుకాణాలకు 18 ఏళ్ల లోపు పిల్లలను అనుమతించరాదని చెప్పారు. కామారెడ్డి జిల్లాలో మొత్తం 94 షాపులకు లైసెన్సులు జారీ అయినట్లు తెలిపారు — అందులో కామారెడ్డిలో 22, ఎల్లారెడ్డిలో 16, బాన్సువాడలో 34, మద్నూరులో 13, గాంధారిలో 9 ఉన్నాయి. ఈ కార్యక్రమంలో డిస్టిక్ ఆఫీసర్ ఆర్ సుధాకర్ మరియు ఫైర్‌ ఆఫీసర్‌ అబ్దుల్‌ సలాం పాల్గొన్నారు.

Exit mobile version