అమృత నగర్ తండా వాసులకి ఫలహారాలు పంపిణీ చేసిన : ప్రేమ కుమార్.

అమృత నగర్ తండా వాసులకి ఫలహారాలు పంపిణీ చేసిన : ప్రేమ కుమార్.

ప్రశ్న ఆయుధం ఆగస్టు 05: కూకట్‌పల్లి ప్రతినిధి           సోమవారం కురిసిన భారీ వర్షాలకు బాలానగర్ జింకల వాడకు చెందిన అమృత నగర్ తండా వాసులు నిరాశ్రయులు లై కుటుంబాలతో సహా కెపిహెచ్‌బి 4వ ఫేజ్ కమిటీ హల్ లో తలదాచుకున్నారు వారికి జనసేన పార్టీ కూకట్‌పల్లి నియోజకవర్గం ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమకుమార్ దుప్పట్లు , పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వాలు ఎన్ని మారినా కూకట్‌పల్లి నియోజకవర్గంలో వర్షం వల్ల ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకు ప్రత్యామ్నాయము లేకుండా పోయిందని, ప్రభుత్వం వెంటనే వారికి తగు పరిష్కారం చూపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గ 114 డివిజన్ ప్రెసిడెంట్ కలిగినడి ప్రసాద్ ,115 డివిజన్ ప్రెసిడెంట్ సలాది శంకర్, అంజి, పోలిబోయిన శ్రీనివాస్, దాసరి వెంకట్ , పులగం సుబ్బు, కృష్ణ , బాలు , జోతిబోస్ బిజెపి నాయకులు కుమార్ , హుస్సేన్, సులోచన తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment