అన్నదాన సమారాధన కార్యక్రమము లో పాల్గొన్న ప్రేమ కుమార్

అన్నదాన సమారాధన కార్యక్రమము లో పాల్గొన్న ప్రేమ కుమార్

ప్రశ్న ఆయుధం, అక్టోబరు 22: కూకట్‌పల్లి ప్రతినిధి

కెపిహెచ్‌బి కాలనీ 2వ రోడ్ లో గల శ్రీశ్రీశ్రీ షిర్డి సాయిబాబా దేవాలయం వారి ఆధ్వర్యంలో శ్రీ సాయి మణికంఠ భక్త సమాజం వారు నిర్వహించిన మొదటి రోజు అయ్యప్ప స్వాముల అన్న సమారాధన కార్యక్రమమునకు నిర్వాహకులు యల్ . రాజ, యల్. నాగేశ్వర్రావు ఆహ్వానం మెరకు కూకట్ పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమకుమార్ అయ్యప్పస్వామికి జరిగిన ప్రతేక పూజలలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మాట్లాడుతూ “అన్నదానం అన్నది అత్యున్నతమైన దానం. భక్తి, సేవ, సమర్పణ — ఈ మూడు మనిషిని దైవత్వం వైపు నడిపిస్తాయి. అయ్యప్ప స్వామి కృపతో అందరికీ శాంతి, సౌఖ్యం కలగాలని కోరుకుంటున్నాను.” అని తెలిపి స్వాములతో కలిసి అన్న ప్రసాదాలు స్వీకరించారు . అనంతరం నిర్వహకులు ప్రేమకుమార్ ని శాలువాతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొల్లా శంకర్, కలిగినీడి ప్రసాద్, దాసరి వెంకట్, పోలేబోయిన శ్రీనివాస్, వెంకట్ , మండల రమేష్, పులగం సుబ్బు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment